అవంతి ఫిర్యాదు ఆలస్యమైంది.. హేమంత్ మృతి పై పోలీసులు

Published : Sep 25, 2020, 12:28 PM IST
అవంతి ఫిర్యాదు ఆలస్యమైంది.. హేమంత్ మృతి పై పోలీసులు

సారాంశం

ఈ హేమంత్ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించలేదని హేమంత్ భార్య అవంతి ఆరోపించడం గమనార్హం.  

హైదరాబాద్ నగరంలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు హేమంత్ అనే యువకుడు బలి అయ్యాడు. అతను ప్రేమించిన యువతి అవంతి.. కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. కాగా.. ఈ హేమంత్ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించలేదని హేమంత్ భార్య అవంతి ఆరోపించడం గమనార్హం.

కాగా.. హేమంత్ హత్యపై గచ్చిబౌలి సీఐ మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్‌, అవంతిని తీసుకెళ్లారని వెల్లడించారు. హేమంత్‌ తండ్రి 100కు డయల్‌ చేశారన్నారు. పెట్రోలింగ్‌ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6:30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని గచ్చిబౌలి సీఐ తెలిపారు. అవంతి ఫిర్యాదు చేసేసరికే హేమంత్‌ను చంపేశారన్నారు. ఈ హత్య కేసులో పోలీసుల అలసత్వం ఏమీ లేదన్నారు. హత్యకు అవంతి తండ్రి ధర్మారెడ్డి, బంధువులదే బాధ్యత అన్నారు. ఒకరిద్దరు మాత్రమే బయటివారున్నారని గచ్చిబౌలి సీఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?