బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలు ఉండబోవు,. గత ప్రభుత్వ పాలసీలు బాగుంటే కొనసాగిస్తాం - మంత్రి శ్రీధర్ బాబు

By Sairam Indur  |  First Published Dec 17, 2023, 4:17 PM IST

తమ ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోబోదని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Telangana IT Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతామని చెప్పారు. 


గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఉండబోవని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. దేశంలో నెంబర్ 1గా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారిగా శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గానికి చేరుకున్నారు. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

Latest Videos

ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకొని వెళ్తుందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీలు బాగుంటే వాటిని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మహారాష్ట్ర నాగ్‌పూర్ సోలార్ కంపెనీలో పేలుడు: తొమ్మిది మంది మృతి

ప్రతీ సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం బడ్జెట్ ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడుపుతామని తెలిపారు. ప్రతీ ఒక్కరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. 

రెండేళ్ల క్రితం భర్త మృతి: అతడి వీర్యంతో పండంటి బిడ్డకు జన్మ, ఎలాగంటే?

కాగా.. అంతకు ముందు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటి అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 

click me!