హైదరాబాద్‌లోని రెస్టారెంట్ చైన్‌లలో ఒకటైన నాయుడు గారి కుండ బిర్యానీ కేవలం 2 రూపాయాలకే బిర్యానీని అందిస్తోంది . రూ.2కే బిర్యానీ అని సంబరపడిపోయి.. ఆ హోటల్ వైపు పరుగులు తీయొద్దు . ఇక్కడే యాజమాన్యం ఓ ట్విస్ట్ ఇచ్చింది.
బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరడం ఖాయం. ఇంట్లో ఏ శుభకార్యమైనా, స్నేహితులతో పార్టీ చేసుకోవాలన్నా మెనూలో బిర్యానీ వుండాల్సిందే. ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ బిర్యానీ ఘుమఘుమలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్‌లో హోటల్స్ రకరకాల ఆఫర్స్‌తో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బిర్యానీ ప్రియులకు ఆహ్లాదకరమైన ట్రీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని రెస్టారెంట్ చైన్‌లలో ఒకటైన నాయుడు గారి కుండ బిర్యానీ కేవలం 2 రూపాయాలకే బిర్యానీని అందిస్తోంది.
రూ.2కే బిర్యానీ అని సంబరపడిపోయి.. ఆ హోటల్ వైపు పరుగులు తీయొద్దు. ఇక్కడే యాజమాన్యం ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఈ డీల్‌ను పొందాలంటే కస్టమర్‌లు తప్పనిసరిగా రూ.2 నోటుతో చెల్లించాలి. ప్రస్తుతం రూ.2 రూపాయల నోట చెలామణిలో వుందో లేదో తనిఖీ చేసేందుకు హోటల్ యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 100 మందికి పైగా ఆహార ప్రియులు ఈ ఆఫర్‌ను ఆస్వాదించారు.
నాయుడు గారి కుండ బిర్యానీ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌లలో శాఖలు కలిగి వుంది. అయితే రూ.2 బిర్యానీ మాత్రం కూకట్‌పల్లి ఔట్‌లెట్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో వుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి రెస్టారెంట్ ఇలాంటి ఆఫర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో వారు ‘‘బాహుబలి థాలీ’’ అనే ఛాలెంజ్ విసిరారు. దీనిలో భాగంగా 30కి పైగా రుచికరమైన వంటకాలను 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి వుంటుంది. బాహుబలి థాలీ అసలు ధర రూ.1999 . ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు .
ఇకపోతే.. స్విగ్గీ 2023 ట్రెండ్స్‌లో హైదరాబాద్‌లో వరుసగా 8వ ఏడాది బిర్యానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లో 40,30, 827 సెర్చ్‌లు బిర్యానీ కోసమే జరిగేవట. ప్రతి ఆరవ బిర్యానీ డెలివరీకి సంబంధించినదే కాగా నిమిషానికి 15 బిర్యానీలను తినడం ద్వారా భోజనం ప్రియులు దానిపై తమకున్న తిరుగులేని అభిమానాన్ని ప్రదర్శించారు.