అవినీతికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స్త‌కే లేదు.. బీఆర్ఎస్ కు ఉత్త‌మ్ కుమార్ వార్నింగ్

By Mahesh Rajamoni  |  First Published Feb 10, 2024, 8:05 PM IST

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునర్వైభవం కోసం మధ్యంతర బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ఊహించినట్లుగా అంద‌రికీ లబ్ధి చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిందని  పేర్కొన్నారు. 
 


Telangana - Uttam Kumar Reddy: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంద‌రి ప్ర‌యోజ‌నాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ద‌ని తెలంగాణ పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ఆర్థిక పునరుజ్జీవనానికి మధ్యంతర బడ్జెట్‌ బలమైన పునాది వేసి అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వంలోని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందనీ, ఆర్థిక దుర్వినియోగానికి పాల్ప‌డింద‌నే అభిప్రాయ‌ప‌డ్డారు. గత 10 సంవత్సరాలలో గత బీఆర్ఎస్ పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌లో ఊహించినట్లుగా అంద‌రికీ లబ్ధి చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అవినీతికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స్త‌కే లేద‌ని పేర్కొన్నారు. త‌ప్పుడు, అవినీతి ప‌ద్ద‌తుల‌కు పాల్ప‌డిన వారిని త‌ప్ప‌కుండా విచారించి శిక్షిస్తామ‌ని ఉత్త‌మ్ అన్నారు.

Latest Videos

undefined

మీ పిల్లాడు మొండిగా, మూడీగా ఉంటున్నాడా? ఇలా హ్యాండిల్ చేయండి..

అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల నాణ్యత, అనాలోచిత డిజైన్‌లు, అవినీతిపై ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించామని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కేలా చూసుకోవ‌డానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్‌లో నీటిపారుదల విభాగానికి రూ.28,024 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరందించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఉత్త‌మ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినట్టుగా తక్కువ వ్యయంతో పూర్తి చేయగల ప్రాజెక్టులు, ఎక్కువ ఆయకట్టును సృష్టించగల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఉంటుంద‌ని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తామని ఉత్త‌మ్ చెప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు ఎల్‌ఐఎస్, రాజీవ్ భీమా ఎల్‌ఐఎస్, కోయిల్ సాగర్ ఎల్‌ఐఎస్, ఎస్‌ఆర్‌ఎస్‌పి-ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ స్కీమ్ I, కొమరం భీం, చిన్న కాళేశ్వరం వంటి ఇతర ప్రాజెక్టులు చేపట్టనున్న‌ట్లు తెలిపారు.

బాబ్రీ మ‌సీదుపై లోక్ స‌భ‌లో అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

click me!