కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపు సమయంలో చోరీ జరిగింది. ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే దీనిని అధికారులు గుర్తించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారని సమాచారం.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. హుండీ లెక్కింపు సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామివారి ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి ఈ చోరీకి పాల్పడ్డాడు. హుండీ లెక్కింపు చేసేందుకు వచ్చిన అతడు రూ.10 వేలను చోరీ చేస్తుండగా ఆలయన అధికారులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చూడకుంటా తింటే హాస్పిటల్ కే.. ప్రముఖ రెస్టారెంట్ లోని బిర్యానీలో చచ్చిన బొద్దింక..
అనంతరం సదరు ఉద్యోగిని పోలీసులకు అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. దొంగతనం చేస్తూ పట్టుబడిన నిందితుడిని కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామవాసిగా అధికారులు గుర్తించారు. కాగా.. గతంలో కూడా కొండగట్టు ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
రామలయ ప్రారంభోత్సవం.. అది ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యక్రమం.. దానికి రాలేము - కాంగ్రెస్
గతంలో దేవస్థానానికి సంబంధం ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి దొంగతనం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఎండోమెంట్ కమిషనర్ వరకు వెళ్లింది. అయితే తాజాగా జరిగిన దొంగతనం ఆలయ వర్గాల్లో చర్చనీయాశం అయ్యింది. ఈ ఘటన హుండీ లెక్కింపు సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది