ఇటీవల హైదరాబాద్ లోని రెస్టారెంట్లు (hyderabad restaurants) పరిశుభ్రత పాటించడం లేదు. బిర్యానీ (biryani)ల్లో కీటకాలు, బల్లి అవశేశాలు కనిపిస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ (jublihills)లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో బొద్దింక (Cockroach) కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో ఏ ఫుడ్ ఫేమస్ అంటే వెంటనే గుర్తొచ్చోది బిర్యానీనే. హైదరాబాద్ లో బిర్యానీ అంటే దేశ వ్యాప్త గుర్తింపు ఉంది. తెలంగాణ, ఏపీ నుంచి లేదా దేశంలోని ఏ మూల నుంచి మన భాగ్యనరానికి వచ్చిన ఎవరైనా, ఒక్క సారైనా బిర్యానీ రుచి చూడక వెళ్లరు. అంతటి ప్రాముఖ్యత కలిగిన బిర్యానీని తయారు చేయడంలో ఈ మధ్య హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
పలు రెస్టారెంట్లు కష్టమర్లను ఆకర్శిచడంలో చూపెట్టే శ్రద్ద.. బిర్యానీని వండటంలో చూపించడం లేదు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ రెస్టారెంట్ లో వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దానిని చూసి అతడు ఖంగు తిన్నాడు. చచ్చిన బొద్దింక కు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
A customer found a dead cockroach in the biryani which was served to him, at a famous restaurant, in Jubilee Hills, Hyderabad. pic.twitter.com/jDxxIBjAXk
— Surya Reddy (@jsuryareddy)
జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లి, ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ దానిని తీసుకొచ్చి, వడ్డించి వెళ్లిపోయాడు. దానిని తింటున్న క్రమంలో ఆ బిర్యానీలో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీంతో అతడు ఒక్క సారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని అక్కడి సిబ్బందికి, నిర్వాహకులకు తెలియజేశాడు. ఇదేం తీరు అని, ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తూ వారిని నిలదీశాడు.
దీనిని అతడు తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని నెటిజన్లు అధికారులను కోరుతున్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో అపరిశుభ్రమైన ఆహారం వడ్డిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల రాజేంద్రనగర్ లోని ఓ రెస్టారెంట్ తనకు వడ్డించిన బిర్యానీలో ఓ కస్టమర్ కు బల్లి తోక కనిపించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ ఘటనలు నగరంలో ఉన్న వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతపై ఆందోళనలను రేకెత్తిస్తాయి. రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్, చిన్న హోటళ్లే కాదు, కొన్ని ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇదే తీరు కనిపిస్తోంది.