గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor's Quota MLCs) ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram), అలీఖాన్ (Ali Khan)ల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్ కు లేవని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గవర్నర్ కోటాలో జరిగిన ఎమ్మెల్సీలుగా నియామకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గురువారం కీలక తీర్పు వెలువరించింది. గత ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసే అధికారం లేదని పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని గవర్నర్ రద్దు చేశారు.దానిని సవాల్ చేస్తూ వారిద్దరూ కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్
అసలేం జరిగిందంటే.. ?
గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. అయితే వారికి తన కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం అయ్యే అర్హతలు లేవంటూ గవర్నర్ ఆ పేర్లను తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
నేడు కాంగ్రెస్ సీఈసీ మీటింగ్.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ?
ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ లను సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులకు గర్నవర్ ఆమోదం తెలిపారు. తమ అభ్యర్థన పెండింగ్ లో ఉండగానే ఎమ్మెల్సీల నియామకం చేపడుతున్నారంటూ శ్రవణ్, సత్యనారాయణ మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు వారి ప్రమాణ స్వీకారంపై స్టే విధించింది.
బీఆర్ఎస్ అభ్యర్థులు దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తన తీర్పు వెలువరించింది. కోదండరాం, అలీఖాన్ ల నియామకాలను రద్దు చేసింది. ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసే అధికారాలు గవర్నర్ కు లేవని పేర్కొంది. వారి నియామకం పట్ల అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థుల పేర్లను క్యాబినేట్ కు తిప్పి పంపించాలని సూచించింది. దీంతో శ్రవణ్ సత్యనారాయణలకు కొంత ఊరట లభించింది. అయితే ఈ పరిణామం తరువాత కాంగ్రెస్ ఎలాంటి అడుగులు వేస్తుందనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.