మైక్రో ఫైనాన్స్ యాప్స్: 'హైద్రాబాద్ లో 11 మంది అరెస్ట్'

By narsimha lode  |  First Published Dec 22, 2020, 5:02 PM IST

మైక్రో ఫైనాన్స్ యాప్స్ పేరుతో రుణ గ్రహీతలను వేధింపులకు  గురిచేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 


హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ యాప్స్ పేరుతో రుణ గ్రహీతలను వేధింపులకు  గురిచేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 

మంగళవారం నాడు ఆయన  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్ మొబైల్ యాప్స్ పేరుతో వేధింపులకు గురి చేసినట్టుగా పలు కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్: 4 కాల్ సెంటర్లు సీజ్, ఆరుగురి అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ యాప్ సంస్థకు  చెందిన ఐదుగురిని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. మరోవైపు ఇదే విషయమై హైద్రాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

రెండు టెలికాలర్స్ సంస్థల్లో సోదాలు, 11 మంది  ఉద్యోగులను గుర్తించినట్టుగా ఆయన తెలిపారు. లియో ఫాంగ్, హాట్ పుల్, పిన్ ప్రింట్, నబ్లూమ్ టెక్నాలజీ సోదాలు నిర్వహించామన్నారు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి: డీజీపీ గౌతం సవాంగ్

తెలంగాణకు సంబంధించి టెలికాలర్స్ సూత్రధారి మధును అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ఈ కేసులో మరో కీలక నిందితుడి కోసం  గాలింపు చర్యలు చేపడుతామన్నారు. ఢిల్లీ కాల్ సెంటర్లలో 700 ల్యాప్‌టాప్ లను సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. హైద్రాబాద్ లో వందల సంఖ్యలో కంప్యూటర్లు ఫ్రీజ్ చేశామన్నారు.ఎవరూ కూడ ఇన్‌స్టంట్ లోన్లు తీసుకోవద్దని ఆయన సూచించారు. ఇబ్బందులకు గరైతే నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.


 

click me!