ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

Published : Apr 24, 2023, 07:54 AM IST
ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

సారాంశం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య బావిలో దూకిందనే భయంతో ఆమెను కాపాడుదామని  భర్త కూడా అందులో దూకాడు. కానీ అతడికి ఈత రాదు. దీంతో అతడి మిత్రుడు కూడా బావిలో దూకాడు. ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. 

అతడికి ఈత రాదు. కానీ భార్యను కాపాడుదామనే ఉద్దేశంతో ఆమె కోసం సాహసం చేసి బావిలో దూకాడు. ఈ విషయం తెలుసుకొని అతడి స్నేహితుడు కూడా వచ్చి బావిలో దూకాడు. కానీ ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. ఈ విషాదం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో  కర్లపూడి నాగరాజు, రమణ అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన భార్య.. ‘బావిలో దూకి చచ్చిపోతాను’ అని అనుకుంటూ ఇంటి నుంచి బయలుదేరింది. సమీపంలోని వ్యవసాయక్షేత్రాల వైపు ఆమె వెళ్లింది. ఆమెను వెతుక్కుంటూ భర్త కూడా వెళ్లాడు. కానీ చుట్టుపక్కల కనిపించలేదు. దీంతో పొలంలో ఉన్న బావిలో దూకి ఉంటుందని అనుకొని వెంటనే తనకు ఈతరాదనే విషయం కూడా ఆలోచించకుండా అతడూ దూకాడు.

అతిక్ అహ్మద్ ఆఫీసు ఎదుట హారన్ కొట్టినా.. బంధించి టార్చర్ పెట్టేవాడు - డాన్ హింసలు గుర్తు చేసుకున్న మహిళా రైతు

నాగరాజుకు ఈత రాదనే విషయం తెలుసుకొని అతడి మిత్రుడైన యండ్రాతి జోజి బావిలో దూకాడు. అయితే ఇద్దరూ నీటిలోనే మునిగిపోయి కనిపించకుండా పోయారు. కానీ కొంత సమయం తరువాత స్థానికులకు నాగరాజు భార్య రమణ సమీపంలోని పొలాల్లో కూర్చొని ఏడుస్తూ కనిపించింది.

PREV
click me!

Recommended Stories

KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu
CM Revanth Reddy Speech: అందుకే చంద్రబాబుని, టీడీపీని వదులుకొని కాంగ్రెస్ కి వచ్చా | Asianet Telugu