రేవంత్, ఈటల ఒక్కటే.. ఇద్దరి మధ్య హుజురాబాద్ కోసం రూ.25 కోట్ల డీల్ : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆరోపణలు

By Siva KodatiFirst Published Apr 23, 2023, 9:18 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. వేం నరేందర్ కుమారుడి పెళ్లిలో హుజురాబాద్ ఉపఎన్నిక డీల్ కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. 
 

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల , రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు. రేవంత్‌కు గతంలో ఈటల డబ్బులిచ్చారని తాను చెప్పానని.. అప్పుడు స్పందించని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. వేం నరేందర్ కుమారుడి పెళ్లిలో హుజురాబాద్ ఉపఎన్నిక డీల్ కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

లెజెండ్స్ రెస్టారెంట్‌లో రూ.25 కోట్ల డబ్బు చేతులు మారిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఇల్లంతకుంట రామాలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఆయన ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. ఈటల, రేవంత్ మధ్య తేడాలు రావడంతోనే విషయం బయటకు వచ్చిందని.. రాజేందర్ బ్రోకర్ల కమిటీ ఛైర్మన్ అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్, వివేక్ మధ్య వున్న ఆర్ధిక వ్యవహారాల సెటిల్‌మెంట్ కోసమే అమిత్ షా చేవేళ్ల సభకు వచ్చారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 

Latest Videos

ఇకపోతే.. తనపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌లో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసునన్నారు. తొమ్మిదేళ్లలో తనపై కక్షపూరితంగా కేసులు పెట్టించి, జైల్లో వుంచిన కేసీఆర్‌తో తాను ఎలా కలుస్తానని రేవంత్ ప్రశ్నించారు. చివరికి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇబ్బందులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్

నోటీసులు రాగానే నీలాగా భయపడి లొంగిపోలేదని.. చిప్పకూడు తింటే ఆ పరిస్ధితి తెలుస్తుందని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో కరడుగట్టిన ఉగ్రవాదుల్ని వుంచే డిటెన్షన్ సెల్‌లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తుచేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే వారిపై ఈటల రాజేందర్ దాడి చేస్తున్నారని.. చిల్లర రాజకీయాలు సరికాదని రేవంత్ హితవు పలికారు. 

ఈ వ్యాఖ్యలకు ఆదివారం ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు. మీడియా సమావేశంలో  తాను ఏ రాజకీయ నేత గురించి మాట్లాడలేదని  ఈటల రాజేందర్ స్పష్టం  చేశారు. తాను రేవంత్ రెడ్డి  పేరే ప్రస్తావించలేదన్నారు. కానీ  భాగ్యలక్ష్మి ఆలయం వద్ద  రేవంత్ రెడ్డి  కన్నీళ్లు పెట్టుకుంటూ  తన గురించి అసభ్యంగా మాట్లాడారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను  నిత్యం  ఉద్యమం చేసినట్టుగా ఆయన  గుర్తు  చేశారు. కానీ  ఆ సమయంలో  రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగాడని  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు. 

click me!