రేషన్ కార్డు ఈ-కేవైసీ గడవు తేదీని పొడగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలల నుంచి ఈ-కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. ఇంకా పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మరో నెల రోజులు దీనిని పొడగించింది.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేసుకోని వారి కోసం వెసులుబాటు కల్పించింది. దాని కోసం గడవును పొడగించింది. ఈ నిర్ణయం చాలా మంది రేషన్ కార్డు లబ్దిదారులకు ఉపయోగకరంగా మారనుంది. మరో నెల రోజుల పాటు దీని కోసం గడువు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా బీమా పథకం.. అర్హులెవరంటే?
undefined
వాస్తవానికి తెలంగాణంలోని రేషన్ కార్డు దారులందరూ ఈ-కేవైసీ చేసుకోవాలని రెండు నెలల కిందట ప్రభుత్వం సూచించింది. దీని కోసం రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ సమీప రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి తమ ఆధార్ నెంబర్ తో వేలి ముద్ర ద్వారా దానిని పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియకు 2023 డిసెంబర్ 31ను చివరి తేదీగా నిర్ణయించింది. ఆ లోపు అందరూ ఈ-కేవైసీ చేసుకోవాలని పేర్కొంది.
PM Modi: ఉజ్వల లబ్దిదారుల ఇంట్లో టీ తాగిన ప్రధాని.. ‘చాయ్‌వాలాగా నాకు తెలుసు’.. ముచ్చట్లు ఇలా..
కానీ ఇప్పటికీ చాలా మంది రేషన్ లబ్దిదారులు దీనిని పూర్తి చేసుకోలేదు. రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో పలువురు చదువులు, ఉద్యోగాల నిమిత్తం స్వగ్రామాలకు దూరంగా ఉండటం, ఇంకా పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ-కేవైసీని పూర్తి చేయడంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే అత్యల్పంగా 54.17 శాతంతో వనపర్తి జిల్లా అట్టడుగున నిలిచింది. పలు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.
Praja Palana: 'ప్రజాపాలన'కు బ్రేక్.. ఈ రెండు రోజులు దరఖాస్తులు తీసుకోరు..
ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువును 2024 జనవరి 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇంత వరకు ఈ-కేవైసీ చేసుకోని రేషన్ కార్డు వినియోగదారులకు లబ్ది చేకూరనుంది.