CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా బీమా పథకం.. అర్హులెవరంటే?

By Rajesh KarampooriFirst Published Dec 31, 2023, 7:38 AM IST
Highlights

CM Revanth Reddy: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5,00,000/- (రూ. ఐదు లక్షల ) కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. ఇందు కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. 

CM Revanth Reddy: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్  ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మేనిఫోస్టోలోని రెండు గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు గ్యారంటీల అమలు దిశగా అడుగువేస్తుంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5,00,000/- (రూ. ఐదు లక్షల ) కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. ఇందు కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.  దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.
 

Latest Videos

ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గిగ్‌ వర్కర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గిగ్‌ వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో  తమకు ఉద్యోగ భద్రత, తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ ను గిగ్‌ వర్కర్లు కోరారు. దీంతో తాజాగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే..రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.  ఈ ఉత్వర్తులతో పాటు నాలుగు నెలల క్రితం కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ రిజ్వాన్ కుటుంబాన్ని  సీఎం రేవంత్ ఆదుకున్నారు. ఆ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చెక్కును శనివారం అందజేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయంపై గిగ్‌ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

click me!