తెలంగాణలో కరోనా టెస్టులను పది రెట్లు పెంచాలి: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు

By narsimha lode  |  First Published Jul 13, 2020, 7:47 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న టెస్టుల కంటే పది రెట్లు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె. సుజాతారావు అభిప్రాయపడ్డారు. టెస్టుల ఫలితాలు ఒక్క రోజులోనే వచ్చేలా చూడాలని ఆమె సూచించారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న టెస్టుల కంటే పది రెట్లు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె. సుజాతారావు అభిప్రాయపడ్డారు. టెస్టుల ఫలితాలు ఒక్క రోజులోనే వచ్చేలా చూడాలని ఆమె సూచించారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  తక్కువ టెస్టులు చేస్తున్నా కూడ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ఆందోళన చెందారు. కరోనాను ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాల్సి అవసరం ఉందన్నారు. ప్రారంభం నుండే ఎక్కువ టెస్టులు చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. 

Latest Videos

undefined

లాక్‌డౌన్ ఉద్దేశం కేసుల సంఖ్యను తగ్గించడం కాదు.. ఇన్ఫెక్షన్‌ను తట్టుకునేలా వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవడం అని సుజాత రావు తెలిపారు.
కేంద్రం సూచనల కోసం ఎదురు చూడకుండా పొరుగున ఉన్న ఏపీ ముందే అప్రమత్తమైందని సుజాతా రావు గుర్తు చేశారు. కరోనా ప్రారంభ దశలోనే లక్షకు పైగా  ఏపీ ప్రభుత్వం కిట్లు కొనుగోలు చేసిందని ఆమె గుర్తు చేశారు.. 

ప్రైవేట్  హాస్పిటళ్లు కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేయకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె సూచించారు. 

తెలంగాణకు అద్భుతమైన ఆరోగ్య మౌలిక వసతులు ఉన్నాయన్న సుజాత రావు చెప్పారు. సమర్థులైన అధికారులు, మంచి ఐటీ, ఫార్మా నెట్‌‌వర్క్ ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే అత్యున్నత స్థాయి ప్రజారోగ్య నిపుణులను ఆహ్వానించాలని ఆమె సూచించారు. 

click me!