నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ నాగేశ్వరరావు సోమవారం నాడు రాజీనామా చేశారు. ఈ ఆసుపత్రిలో వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆయన సూపరింటెండ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ నాగేశ్వరరావు సోమవారం నాడు రాజీనామా చేశారు. ఈ ఆసుపత్రిలో వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆయన సూపరింటెండ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ నెల 9వ తేదీన రాత్రి నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నలుగురు కరోనా రోగులు మరణించారు. కరోనా రోగులు మరణించడానికి ఆక్సిజన్ అందకపోవడమే కారణమని బందువులు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ విషయం ఈ నెల 10వ తేదీన వెలుగు చూసింది.
undefined
also read:నిజామాబాద్‌లో ప్రభుత్వాసుపత్రిలో కలకలం: ఒకే రోజూ కరోనాతో నలుగురు మృతి
కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 11వ తేదీన ఆటోలో తరలించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి నుండి ఆటోలో డెడ్ బాడీని తమ ఇంటికి బంధువులు తీసుకుపోయారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ విషయమై డీఎంఈ రమేష్ విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ నలుగురు సభ్యులతో విచారణ కమిటిని ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించకుండా ఆటోలో డెడ్ బాడీని తరలించడంపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.నిజామాబాద్ ఆసుపత్రిలో వరుస సంఘటనలు చోటు చేసుకోవడంపై నాగేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారు.
దీంతో సూపరింటెండ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నాగేశ్వరరావు వాయిస్ మేసేజ్ పంపారు. డీఎంఈకి రాజీనామా పత్రాన్ని కూడ పంపినట్టుగా ఆయన ఈ వాయిస్ మేసేజ్ లో చెప్పారు.