అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది: టెక్కీ లహరి చివరి వీడియో

Published : Jul 13, 2020, 05:27 PM ISTUpdated : Jul 13, 2020, 05:40 PM IST
అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది: టెక్కీ లహరి చివరి వీడియో

సారాంశం

టెక్కీ లహరి ఆత్మహత్య చేసుకొనే ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. భర్త వెంకటేష్ ఏ రకంగా తనను వేధింపులకు గురి చేశాడో ఆమె వివరించింది.

అమరావతి: టెక్కీ లహరి ఆత్మహత్య చేసుకొనే ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. భర్త వెంకటేష్ ఏ రకంగా తనను వేధింపులకు గురి చేశాడో ఆమె వివరించింది.

ప్రేమించి పెళ్లి చేసుకొన్న తర్వాత నీ విశ్వరూపం నాకు తెలిసిందని లహరి ఆవేదన చెందింది. తాను సంపాదించిన ఆస్తి మొత్తం నీ ఆస్తిగా చెప్పుకొన్నావని ఆమె ఆ వీడియోలో చెప్పింది. 

ఉద్యోగం లేకపోయినా కూడ తాను వెంకటేష్ ను సంవత్సరాల తరబడి పోషించిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత తనను వేధించడం మొదలు పెట్టావని  లహరి తెలిపింది. 

ప్రతి రోజూ కొట్టేవాడివి, బూతులు తిట్టేవాడివని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని నీవు అనుకొంటున్నావు. కానీ డబ్బుతో అన్నీ సాధించవచ్చని అనుకోవడం పొరపాటని ఆమె తెలిపారు. 

కుక్కలకు కూడ విశ్వాసం ఉంటుంది. నీకు అలాంటి విశ్వాసం కూడ నీకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.ఎంత మంది అమ్మాయిలను ఇలా మోసం చేస్తావని ఆమె ప్రశ్నించింది. నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పి ఆ బంధాన్ని కట్ చేసుకొంటే సరిపోయేదని ఆమె అభిప్రాయపడ్డారు. 

సమాజం కోసం నటించవద్దని ఆమె కోరారు.నీ కుటుంబం గురించి నాకు తెలియకుండానే  నేను నిన్ను పెళ్లి చేసుకొన్నానని లహరి చెప్పారు.కుటుంబం, బంధాల గురించి విలువలు తెలియని మీ నాన్న చెప్పినట్టుగా నీవు వింటున్నావని లహరి వెంకటేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

ఎన్ని గోడలకు తన తలను వేసి కొట్టావో   ఆ గోడలను అడిగితే చెబుతోందని ఆమె  తెలిపారు. అన్నం తినేవాడు ఎవడూ కూడ ఇలా వ్యవహరించడని ఆమె అభిప్రాయపడ్డారు.

మంచి మనిషి అనే ముసుగును తీసేయాలని ఆమె భర్త వెంకటేష్ ను కోరింది. దొంగతనంగా దొంగగా బతకాల్సిన అవసరం లేదన్నారు. పెళ్లి చేసుకొన్న తర్వాత నీ విశ్వరూపం తెలిసిన తర్వాత  మారుతావని భావించినట్టుగా లహరి తెలిపారు. నీ మీద ఉన్న ప్రేమతోనైనా మారుతావని భావించి నీతో కొనసాగినట్టుగా ఆమె తెలిపారు.

 ఈ ఏడాది జూన్ 27వ తేదీన లహరి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె తన బాధను సెల్ఫీ వీడియో తీసుకొంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ