బీఆర్ఎస్ (BRS)నాయకుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్ (Adilabad EX MP Godam Nagesh) బీజేపీ(BJP)లోకి చేరబోతున్నారని తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ (Adilabad BJP MP Ticket) టిక్కెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బలంగా ఉన్న ఉన్న ఆ పార్టీ.. ఫలితాల అనంతరం బలహీన పడుతూ వస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోతున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి చేరిపోయారు.
మూడు రోజుల మచ్చటేనా ?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు.. అసలేమైందంటే ?
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను వేగవంతం చేసింది. ఆయా జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రుల సమక్షంలో భారీగా బీఆర్ఎస్ కు చెందిన నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా అదే వ్యూహంతో పని చేస్తోంది. పలు జిల్లాలో ఆ పార్టీలోకి చేరుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించే నాయకులు కాషాయ శిబిరంలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో బీజేపీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీ రిజర్వ్ డ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావ్ ఉన్నారు. ఈ సారి టిక్కెట్ తమకే ఇవ్వాలంటూ ఆ పార్టీలో నాయకులు పోటీలు పడుతున్నారు. అయితే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ కూడా బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
కాళ్లు నొస్తున్నాయని, లిఫ్ట్ కోసం 108 కు కాల్.. ఫ్రీగా అత్తగారింటికి వెళ్లేందుకు ప్లాన్.. వైరల్
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ గోడం నగేష్ బీజేపీలోకి చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఢిల్లీలో ఆయన బీజేపీ పెద్దలతో సీక్రెట్ గా సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో కలిసి గోడం నగేష్ ఢిల్లీ వెళ్లారని టాక్ నడుస్తోంది. తనకు బీజేపీ నుంచి టిక్కెట్ ఇస్తారనే హామీ ఇస్తే కచ్చితంగా పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారని సమాచారం.
బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
2014లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో వచ్చిన ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి బోథ్ (ఎస్టీ రిజర్వ్ డ్) సీటును ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని, నేరడిగొండ జడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్ కు కేటాయించింది. దీంతో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ కు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో గోడం నగేష్ బీజేపీలోకి చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.