హైద్రాబాద్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది బాలుడు మృతి చెందాడు.
హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్ లో వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. గతంలో కూడ హైద్రాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన తెలిసిందే .
ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రకు చెందిన సూర్యకుమార్ ఉన కుటుంబంతో శంషాబాద్ లో తాత్కాలికంగా గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాడు. సూర్యకుమార్, అతని భార్య, ఏడాది వయస్సున్న కొడుకు ఈ గుడిసెలో నివసిస్తున్నారు.సూర్యకుమార్, ఆయన భార్య యాదమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలానికే మరణించారు. ఏడాది వయస్సున్న మరో చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందాడు.
also read:ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో పరుగులు (వీడియో)
బుధవారం నాడు తెల్లవారుజామున గుడిసె బయటకు వచ్చిన చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో చిన్నారి మృతి చెందాడు. కుక్కలు దాడి చేస్తున్న విషయాన్ని అటు వైపుగా వస్తున్న వాహనదారులు కుక్కలను తరిమివేశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతి చెందాడు.
also read:రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం
2023 ఫిబ్రవరి మాసంలో హైద్రాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ఉపాధి కోసం అంబర్ పేటకు వచ్చాడు. గంగాధర్ కొడుకు వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు. ఇదే తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడ మరో ఘటన చోటు చేసుకుంది. హైద్రాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడిన ఘటనలు ప్రతి రోజూ వందల సంఖ్యలో నమోదౌతున్నాయి. తాజాగా శంషాబాద్ లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
హైద్రాబాద్ లో వీధికుక్కలను సంఖ్యను తగ్గించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ప్రకటించారు. కుక్కల విషయంలో ప్రతి రోజూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడ వస్తున్నాయి. అయితే ఏదైనా సంఘటన జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేయడం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.