2023 ఎన్నికల విజయమే లక్ష్యం.. ఓటర్లను ఆకర్శించేందుకు ‘మునుగోడు మోడల్’లో ప్రచారం చేయాలని కేసీఆర్ ప్లాన్..

By team teluguFirst Published Nov 17, 2022, 12:03 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తమ ఖాతాల్లో వేసుకొని జోరు మీదున్న టీఆర్ఎస్.. అదే హుషారుతో రాష్ట్రంలో మరో సారి గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ‘మునుగోడు మోడల్’ను అమలు చేయాలని నిర్ణయించింది. 

తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. మునుగోడు విజయం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో ఆ నియోజకవర్గంలో అవలంభించిన వ్యూహాలనే 2023 ఎన్నికల్లో గెలుపొందేందుకు అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. 

టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు రాబోయే 10 నెలల్లో ‘మునుగోడు మోడల్’లో ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు ఆకర్శించుకోవడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 100 బ్లాకులుగా విభజించి ప్రతి 100 మంది ఓటర్లకు ఇంచార్జిలను నియమించనున్నారు. మునుగోడు విజయంలో టీఆర్ఎస్ కు ఈ పద్దతి బాగా కలిసి వచ్చిన అంశం.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దూకుడు: తుషార్‌కి నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

ఈ మోడల్ ప్రకారం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ పదిహేను రోజులకు ఒక సారి తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తారు. బ్లాక్ లకు ఇంచార్జులుగా నియమితులైన స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆన్‌లైన్‌లో చర్చలు జరుపనున్నారు. సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి.. 2023 చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, రాబోయే 10 నెలలను ‘‘ఎన్నికల సంవత్సరం’’గా ప్రకటించాలని ఆదేశించిన ఒక రోజు తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

ఇటీవల మునుగోడులో ముగిసిన ఉప ఎన్నికలో నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ప్రతీ యూనిట్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంఛార్జ్ లు గా నియమించారు. ప్రతీ 100 మంది ఓటర్లకు స్థానిక నాయకులను యూనిట్ ఇంచార్జీలుగా నియమించి, వారిని తరచూ కలుసుకుని టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వారికి వివరించారని ‘డెక్కన్ క్రానికల్’ కథనం పేర్కొంది.

క్యాసినో కేసులో ఈడీ దూకుడు: విచారణకు హజరైన ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి

మైక్రో లెవల్ బూత్ మేనేజ్మెంట్ వ్యూహంలో భాగంగా అత్యధిక ఓట్లు పొందేందుకు ఇంచార్జీలు ఓటర్లతో పాటు పోలింగ్ బూత్ లకు వెళ్లడంతో నాయకులు ఓటర్ల మద్దతును పొందారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో యూనిట్ ఇంచార్జీల మొబైల్ ఫోన్ నంబర్లను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపాలని సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. సీఎం కేసీఆర్ వారితో తరచుగా సంభాషించనున్నారు. ఎన్నికలలో టీఆర్ఎస్ బలమైన ప్రదర్శనను నిర్ధారించడానికి మునుగోడు నమూనాపై వర్క్ షాప్ లు నిర్వహిస్తారు.

కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్‌లో కలకలం.. ఆ నేతల్లో అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళన..!

అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి రాబోయే 10 నెలల్లో వరుస జిల్లా పర్యటనలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని ఆయన ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి జిల్లా పర్యటనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. 

click me!