ఓయూ వద్ద ఉద్రిక్తత, కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వి సూర్య

By narsimha lodeFirst Published Nov 24, 2020, 1:14 PM IST
Highlights

 ఉస్మానియా యూనివర్శిటీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. బీజేవైఎస్ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకోవడంతో  ఉద్రిక్తత నెలకొంది. సూర్యను అడ్డుకోలేదని పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై తప్పుడు ప్రచారం సాగుతోందని పోలీసులు తేల్చి చెప్పారు.

హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్శిటీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. బీజేవైఎస్ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకోవడంతో  ఉద్రిక్తత నెలకొంది.

ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లేందుకు  బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వెళ్లేందుకు ప్రయత్నించగా ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. గేటును తోసుకొని బీజేవైఎం కార్యకర్తలతో కలిసి తేజస్వి సూర్య క్యాంపస్ లోకి వెళ్లాడు.

ఓయూ వద్ద ఉద్రిక్తత..బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను అడ్డుకొన్న పోలీసులు.. pic.twitter.com/Dc3zwQcjAT

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ సందర్భంగా  బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు పోలీసుల తీరును తప్పుబట్టారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ కనుసైగల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదన్నారు. యువతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అమరుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

 

 

ఉద్యోగాల కోసం యువత తెలంగాణ రాష్ట్రం సాధించుకొందన్నారు. కానీ యువతకు ఉపాధి రాలేదన్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

తేజస్వి సూర్యను తాము అడ్డుకోలేదని పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటు .. మీడియాలో ప్రచారం సాగుతున్నట్టుగా పోలీసులు గుర్తు చేశారు. సూర్యను పోలీసులు అడ్డుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ రకమైన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

click me!