టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి: ప్రజలకు ఉత్తమ్ పిలుపు

Published : Nov 24, 2020, 12:28 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి: ప్రజలకు ఉత్తమ్ పిలుపు

సారాంశం

టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు.   

హైదరాబాద్:టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. 

మంగళవారం నాడు గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. గతంలో చెప్పిన మాటలనే అమలు చేయకుండా మేనిఫెస్టోలో మళ్లీ అవే మాటలను చెప్పారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదని చెప్పారు. లక్ష డబుల్ బెడ్ రూమ్  ఇళ్లలో ఒక్క ఇళ్లు కూడా ఇవ్వ లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో టీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెప్పిందని ఆయన మండిపడ్డారు.

కరోనా చికిత్సను ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా పేదలకు వైద్య సహాయం అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందన్నారు.

గత ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని అధికార పార్టీ నేతలను నిలదీయాలని  ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu