స్కూల్స్ తెరిస్తే పిల్లలను పేరేంట్స్ పంపుతారా: విద్యాసంస్థల యాజమాన్యాన్ని ప్రశ్నించిన కేటీఆర్

By narsimha lodeFirst Published Nov 24, 2020, 12:49 PM IST
Highlights

ప్రైవేట్ విద్యా సంస్థల ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్: ప్రైవేట్ విద్యా సంస్థల ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

మంగళవారం నాడు హైద్రాబాద్ లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాజనుల పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఆరేళ్ల క్రితం తెలంగాణలో ఏ పరిస్థితి ఉంది... ఇప్పుడు ఎలా పరిస్థితి ఉందో బేరీజు వేసుకొని ఓట్లు వేయాలని  ఆయన కోరారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓటు వేయాల్సిందిగా కోరారు. 

also read:మీ ప్రధాని బుర్రకు కూడా తట్టలేదు, ఎంఐఎంతోనే మా పోటీ: కేటీఆర్

సినిమా థియేటర్లు  తెరిచేందుకు అనుమతించారు, స్కూల్స్ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని తనను కొందరు కోరిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఏపీలో స్కూల్స్ ప్రారంభిస్తే... టీచర్లకు విద్యార్ధులకు కరోనా సోకినట్టుగా వార్తలు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

స్కూళ్లకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు.  చేయగలిగిందే చెబుతాం... చేసిందే చెబుతామన్నారు.కరోనా అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ చెప్పారు. గ్లోబల్ సిటీలు కూడా కరోనా దెబ్బకు కుదేలైనట్టుగా ఆయన గుర్తు చేశారు.కరోనా కారణంగా దెబ్బతిన్న నాయీబ్రహ్మణులు, రజక వృత్తిదారులకు విద్యుత్ బిల్లుల  మాఫీని ప్రకటించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

click me!