
హైదరాబాద్: కేంద్ర మంత్రి Kishan Reddy కాన్వాయ్ ను ఆప్ నేతలు సోమవారం నాడు అడ్డుకున్నారు. దీంతో Hyderabad కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
సోమవారం నాడు పెట్రోల్, డీజీల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ హైద్రాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే హైద్రాబాద్ కలెక్టరేట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. Hyderabad Collectorate లో సమావేశం ముగించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటకు వెళ్లిపోతున్న సమయంలో కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన ఆప్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ క అడ్డుపడ్డారు. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట ఉన్న BJP కార్యకర్తలు ఆప్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను అక్కడి నుండి పంపించి మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ ను ముందుకు పంపించారు పోలీసులు.