చిట్టీ నిర్వాహకుల నిర్వాకం.. పోలీస్ స్టేషన్ లో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

Published : May 30, 2022, 02:01 PM IST
చిట్టీ నిర్వాహకుల నిర్వాకం.. పోలీస్ స్టేషన్ లో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

సారాంశం

కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చిట్టీల నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే గొంతు కోసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం :  పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని suicide attemptకి పాల్పడిన ఘటన Bhadradri Kottagudem జిల్లా అశ్వాపురంలో చోటుచేసుకుంది. అశ్వాపురానికి చెందిన అప్పారావు  స్థానికంగా Chitti వేస్తున్నాడు. నిర్వాహకులకు కొన్ని నెలలుగా డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడారు. శనివారం సాయంత్రం అప్పారావు లేని సమయంలో అతని ఇంటికి చిట్టీ నిర్వాహకులు వెళ్లి.. డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు.

చిట్టీల నిర్వాహకులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పారావు భార్య ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం అప్పారావు అశ్వాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. గతంలో కూడా తన సోదరి, తన కుటుంబంపై చిట్టి నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. ఇప్పుడైనా న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు.  స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసిన తరువాత 108 వాహనంలో  భద్రాచలం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.  ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా,  Hyderabadలో జనవరి 24న ఇలాంటి దారుణమే జరిగింది. నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత ఘోరంగా suicideకు పాల్పడ్డాడు. తలాబ్ కట్టా భవానీ నగర్ లో knifeతో గొంతు కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడా వ్యక్తి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అజార్ (35)గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజులుగా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

నిరుడు సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక (13), యూట్యూబ్ లో ఓ వీడియో  చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకునిఆత్మహత్య చేసుకుంది. అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కోవిడ్ తో మృతి చెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. 

అయితే, ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. బ్లేడ్, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్ రూమ్ కు వెళ్లి బ్లేడ్ తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి 11 గంటలకు మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు