టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి చెమటలు పట్టించారు

Published : Feb 06, 2018, 08:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి చెమటలు పట్టించారు

సారాంశం

చెక్కుల పంపిణీలో గందరగోళం ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కేడర్ శ్రమించి గొడవను పరిష్కరించిన పోలీసులు ప్రొటోకాల్ లేకుండా ఎలా పర్యటిస్తారని కాంగ్రెస్ ఫైర్

కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మండలంలోని కుదురుమళ్ల అనే గ్రామంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతలు చెమటలు పట్టించారు. గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టేందుకు ప్రయత్నించిన నరేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జమ అయ్యారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి అధికారికంగా ఎలా చెక్కుల పంపిణీ చేపడతారని నిలదీశారు.  ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగింది. అయితే పట్నం నరేందర్ రెడ్డి చెక్కుల పంపిణీ సభలో ఉండగానే కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చొచ్చుకునిపోయి గొడవకు దిగారు. దీంతో నరేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలో గొడవ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడినుంచి పంపేందుకు పోలీసులు ఎంతగా శ్రమించారో వీడియోలో చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే