(వీడియో) ధర్నాచౌక్ వ్యతిరేక ధర్నాలో కూర్చున్న పోలీసులు

Published : May 15, 2017, 05:52 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
(వీడియో) ధర్నాచౌక్  వ్యతిరేక ధర్నాలో  కూర్చున్న పోలీసులు

సారాంశం

ధర్నాచౌక్‌ను తరలించాలని స్థానికులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో పాటు మహిళా పోలీసులు కూడా   గుడారం వేశారు. ధర్నా చౌక్‌ను తరలించొద్దని  సీపీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకువచ్చారు.  ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు.  పెద్ద ఎత్తున పోలీసులు మఫ్టీలో ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్‌ రణరంగాన్ని తలపిస్తున్నది.

 

ఇందిరాపార్క్ సమీపంలోని  ధర్నాచౌక్‌ సోమవారం ఉదయం రణరంగంగా మారింది. 

 

ధర్నా చౌక్ తరలింపునువ్యతిరేకించేవారు, సమర్థించే వారు, ధర్నా చౌక్ సమీపంలోని కాలనీ వాసులు పోలీసులులతో కలసి ఒకేసారి తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొనింది.  ప్రత్యర్థి వర్గాల మధ్య తోపులాట మొదలయింది. కుర్చీలు విసిరేనుకున్నారు.చివరకు పోలీసులు స్వల్పంగా లాఠీ ఝళిపించారు. ధర్నా చౌక్ ను తరలింపును నిరసిస్తూ తెలంగాణా లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ధర్నా చౌక్ అక్రమణ కు పిలునిచ్చాయి. అయితే, పోలీసులు  వీరికి వ్యతిరేకంగా కాలనీవాసులు, రాజకీయ కార్యకర్తలకు కూడా అనుమతి నిచ్చారు.

ధర్నాచౌక్‌ను తరలించాలని స్థానికులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నినాదాలు చేస్తుండగా,  సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో  తోపులాట జరిగింది. ఇందులో మఫ్టీ పోలీసులు ప్రవేశించారని అనుమానం. ఇదే ఘర్షణకు దారితీసిందని చెబుతున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు  కమ్యూనిస్టు కార్యకర్తలకు  గాయాలయ్యాయి.  పెద్ద ఎత్తున పోలీసులు మఫ్టీలో ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్‌ రణరంగాన్ని తలపిస్తున్నది. ధర్నా చౌక్ ను అక్రమించుకోవడానికి ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణా జెఎసి, సిపిఐ, సిపిఎం, బిజెపి, తెలుగుదేశం, సిపిఐ ఎం ఎల్, జనసేన తదితర పార్టీలు ఈ రోజు పెద్ద ఎత్తున తరలివచ్చాయి.

ఇదే విధంగా పెద్ద సంఖ్యలో పోలీసులను, మఫ్టీ పోలీసులను కూడా మొహరించారు. ధర్నాలో వీరి హంగామాయే ఎక్కువగా కనిపించింది.

 

‘మేం ఈ కార్యక్రమానికి  రెండు నెలలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అనుమతిని కోరాం. అయితే, రాత్రికి రాత్రి పోలీసులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు, ఏవో సంఘాలకు మాకు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వారికి  అనుమతి ఇచ్చారు.  ఎలా ఇస్తారు? మా శాంతియుత కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు, తగాదా పెట్టేందుకు ప్రభుత్వమే ఇలా చేసింది,’ అని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు.

 

బిజెపి నాయకుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఘర్షణను  ప్రభత్వమే సృష్టిస్తున్నది. ఇదికుట్ర అని ఆరోపించారు.

 

తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ గొడవ ముఖ్యమంత్రి కెసిఆర్ అతి తెలివికి ఇది నిదర్శనమని అన్నారు.

 

 ‘ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు ‘ధర్నాచౌక్ తరలింపు మద్దతుదారు’లను సృష్టించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. చివరకు పెద్ద ఎత్తున మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించి అల్లరి సృష్టించాలని చూస్తున్నారు. ధర్నా చౌక్ కొనసాగించడం మీద అభిప్రాయ బేధాలు ఉన్నందున ధర్నా చౌక్ ను కొనసాగించాలేమని కోర్టుకు చెప్పేందుకు ఇలా చేస్తున్నాడు. ఒక వేళ తరలిస్తే, సెక్రెటేరియట్ కు తరలించాలి. ఎందుకంటే, సెక్రెటేరియట్ లోని సమత ను ఆయన వాడటంలేదు కాబట్టి ధర్నా చౌక్ ను అక్కడికి తరలిస్తే మాకు అభ్యంతరం లేదు,’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

 

ధర్నా చౌక్ అక్రమణ పిలుపు విజయవంతమయిందని, ఇది  ప్రజావిజయమని వేములఘాట్ శ్రీశైల్ రెడ్డి (ప్రజా తెలంగాణా) అన్నారు.ఆయన ప్రకటన ఇది.
 

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?