ధర్నాచౌక్ : తొలిసారి ఉద్యమంలోకి దూకిన జనసేన

First Published May 15, 2017, 5:23 AM IST
Highlights

‘తెలంగాణా సాధించడానికి ఇదే ఇందిరా పార్క్ దగ్గిర ఉన్న  ధర్నా చౌక్ ను టిఆర్ ఎస్ నేతలు కూడా  వేదిక చేసుకున్నారు. అపుడు ఇది ప్రజలకు ఇబ్బంది కల్లించలేదా? ఇది నివాసాలకు దూరంగా ఉంటుంది. వూర్లో రాజకీయ పార్టీల కార్యాలయాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. మరి ఆ పార్టీ కార్యాలయాలనుకూడా తరలిస్తారా? వాటిని తరలిస్తే, మేం ధర్నా చౌక్ ను తరలించేందుకు సిద్ధం. ముందు పార్టీ కార్యాలయాలను వూరి బయటకు తరలిస్తారా...’

 

తెలంగాణా లో సాగుతున్న ప్రతిపక్ష ఉద్యమంలో జనసేన పాల్గొంది. బహుశా ఒక ఉద్యమంలో పార్టీ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసే పార్టీ  పాల్గొనడం ఇదే మొదలు

 

జనసేన కార్యకర్తలు  పెద్ద ఎత్తున ఈ రోజు హైదరాబాద్ లో ధర్నా చౌక్ తరలింపునకు వ్యతిరేకంగా అఖిల పక్ష పిలుపు మేరకు జరుగుతున్న ఉద్యమంలో  పాల్గొన్నారు. ధర్నాచౌక్ ను కొనసాగించాలని నినాదాలు చేశారు. జనసేన జండాలు ప్రదర్శించారు. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

మూడు రోజుల కిందట సిపిఎం నాయకులతో చర్చలు జరిపిన అనంతరం పవన్ కల్యాణ్ ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, నిరసన ఉద్యమంలో పాల్గొంటామని కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు నేడు జనసేన కార్యకర్తలు నేడు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు. అయితే, జనసేన కార్యకర్తలను పోలీసులు ధర్నా చౌక్ దగ్గరకు అనుమతించలేదు. వీరంతా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసలు వారిని అడ్డుకున్నారు.

 

జనసేన నాయకులు పోలీసుల చర్యను తీవ్రంగా గర్హించారు.

 

ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత సృష్టించేందుకు  ప్రభుత్వం స్థానికులను, ఇందిరా పార్క్ వచ్చే వాకర్లను రెచ్చగొడుతున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. ఇదే విధంగా ధర్నా చౌక్ ను తరలింపు మద్దతు దారులను కూడా ఈ రోజు ధర్నాకు అనుమతించడం అధికార పార్టీడ్రామా అని జనసేన ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

‘తెలంగాణా సాధించడానికి ఇదే ఇందిరా పార్క్ దగ్గిర ఉన్న  ధర్నా చౌక్ ను టిఆర్ ఎస్  వేదిక చేసుకున్నారు. అపుడు ఇది ప్రజలకు ఇబ్బంది కల్లించలేదా? ఇది నివాసాలకు దూరంగా ఉంది. వూర్లో అన్ని పార్టీ కార్యాలయాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. మరి ఆ పార్టీ కార్యాలయాలనుకూడా తరలిస్తారా? వాటిరి  తరలిస్తే, మేం ధర్నా చౌక్ ను తరలించేందుకు సిద్ధం. పార్టీ కార్యాలయాలను వూరి బయటకు తరలిస్తారా...’అని జనసేన ప్రతినిధి అన్నారు.

 

‘ధర్నా చౌక్ అని అందరిది. రేపు పోలీసుల ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ ధర్నా చేయవలసి రావచ్చు. ఇది ప్రజాస్వామికంగా నిరసన వ్యక్తం చేసేందుకు ఎపుడో ఏర్పాటు చేసిన వేదిక,’ అని ఆయన చెప్పారు.

 

click me!