
హైదరాబాద్ లో ని ధర్నా చౌక్ వల్ల ట్రాఫిక్ సమస్యలొస్తున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ సాకులు చెబుతున్న సర్కారు లాఠీ చార్జీ చేసి మరీ ఇప్పుడు ధర్నా చౌక్ ను ఎత్తేస్తుంది. పోలీసులతోనే పోటీ ధర్నాలు చేయిస్తూ నిరసన కేంద్రాన్ని తరలించేందుకు కుట్ర పన్నుతోంది.
అయితే ధర్నా చౌక్ సమీపంలో ఉంటున్న ఈ బామ్మ మాత్రం ప్రభుత్వ తీరుకు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది.
ఎన్నో ఏళ్లుగా తాము ధర్నా చౌక్ సమీపంలోనే ఉంటున్నామని తెలిపింది. అంతేకాదు తమకు ధర్నా చౌక్ వల్ల ఏలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు తలెత్తలేదని చెప్పింది.
అంతేకాదు ‘ఈ రోజు ధర్నా చేస్తున్నవాళ్లు తమ ఇంటి వద్దకు వచ్చి మంచి నీళ్లు అడిగారు. వారి దాహం తీర్చడానికి నీళ్లు ఇచ్చాను. అప్పటి నుంచి చాలా మంది మా ఇంటి వద్దకు వస్తూనే ఉన్నారు. అందుకే ఇలా బయటే మంచి నీళ్లు పెట్టాను‘ అని తన ఉదారతను చాటుకుంది.
స్థానికులకు ఇబ్బంది కలుగుతుందనే ధర్నా చౌక్ ఎత్తివేయాల్సి వస్తోందంటున్న సర్కారు.. ఈ బామ్మ మాటలకు ఏం సమాధానం చెబుతుంది....?