కరోనాతో తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ మనోజ్ మృతి

By narsimha lodeFirst Published Jun 7, 2020, 1:02 PM IST
Highlights

కరోనాతో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న మనోజ్ అనే జర్నలిస్టు మృతి చెందాడు.కరోనా వైరస్ సోకిన మనోజ్ నాలుగు రోజుల క్రితం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరాడు.
 

హైదరాబాద్: కరోనాతో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న మనోజ్ అనే జర్నలిస్టు మృతి చెందాడు.కరోనా వైరస్ సోకిన మనోజ్ నాలుగు రోజుల క్రితం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరాడు.

మాదన్నపేటలో ఓ తెలుగు న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న మనోజ్ కి కరోనా వైరస్ సోకింది. కరోనాతో ఇతర వ్యాధులు కూడ ఆయనకు సోకాయి. నాలుగు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఆ ఛానల్‌లో మనోజ్ క్రైమ్ రిపోర్టుగా పనిచేస్తున్నాడని సమాచారం. 

ఆదివారం నాడు ఉదయం పది గంటలకు ఆయన మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు.మిస్త్రినియా గ్రేవీస్ వ్యాధితో బాధపడుతున్నాడు మనోజ్. దీనికితోడుగా ఆయన కోవిడ్ సోకింది.  కరోనా సోకి ఓ జర్నలిస్టు మృతి చెందడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమం.

also read:24 గంటల్లో తెలంగాణలో రికార్డు: మొత్తం కరోనా కేసులు 3496కి చేరిక

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు అత్యధికంగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నాటికి కరోనా కేసులు రాష్ట్రంలో 3496కి చేరుకొన్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదౌతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిల్లోనే చోటు చేసుకొంటున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 123 మంది మరణించారు. శనివారం నాటికి కరోనాతో 10 మంది మరణించారు. 


 

click me!