తెలుగు అకాడమీ స్కామ్: నిందితుల వింత జవాబులు, మరో నలుగురి పాత్ర

By telugu teamFirst Published Oct 12, 2021, 7:12 AM IST
Highlights

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నిందితులు సీసీఎఎస్ పోలీసుల విచారణలో వింత సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు నిందితులు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం.

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నిందితులు సిసీఎస్ పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది. తాము కొల్లగొట్టిన 64 కోట్ల రూపాయలను పోలీసులు ఏం చేశారనేది తేలడం లేదు. Telugu Akademi scam కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. వారిలో 9 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు 

విచారణలో నిందితులు సహకరించడం లేదని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు సోమవారంనాడు వింత జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఖర్చులు పెరిగాయని, దాంతో పెద్ద యెత్తున అప్పులు చేశఆమని, ఆ అప్పులు తీర్చడానికి ఈ అక్రమానికి పాల్పడ్డామని నిందితుల్లో కొందరు చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: elugu AKademi Scam : స్కామ్ సొమ్ముతో వివాదాస్పద భూముల కొనుగోలు.. అవే ఎందుకంటే...

కావాలనే వాళ్లు వాస్తవాలను దాస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ కుంభకోణం వెనక మరో నలుగురి ప్రమేయం ఉండవచ్చునని అనుకుంటున్నారు. ఈ కోణంలో వారు దర్యాప్తు సాగిస్తున్నారు. తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి వ్యక్తిగత సహరాయకుడు సురభి వినయ్ కుమార్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటపడవచ్చునని భావిస్తున్నారు. వినయ్ కస్టడీని కోరుతూ మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది

నిందితులు కొల్లగొట్టిన రూ.64 కోట్లలో పోలీసులు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బులతో నిందితులు స్థలాలు, ఆపణరాలు, ఫాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తిచారు. అటువంటి ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

Also Read: Telugu akademi scam: మాజీ డైరెక్టర్ పీఏ వినయ్‌కుమార్ లీలలెన్నో, రూ. 12 లక్షలు సీజ్

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో యుబిఐ మేనేజర్ మస్తాన్ వలీ, తెలుగు అకాడమీ ఏసీవో రమేష్ తో పాటు 14 మంది అరెస్టయ్యారు. తెలుగు ఆకాడమీ నిధులను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పంపకం చేయడానికి సిద్ధపడిన సమయంలో కుంభకోణం వెలుగు చూసింది. తాము చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయం కావడంపై తెలుగు అకాడమీ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుంభకోణం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. త్రిసభ్య కమిటీ విచారణ జరిపి తన వంతుగా ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సత్యనారాయణ రెడ్డికి తెలంగాణ అకాడమీ దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో సోమిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సోమిరెడ్డి హయాంలోనే ఈ కుంభకోణం వెలుగు చూసింది. దీంతో సోమిరెడ్డిని ప్రభుత్వం తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అప్పగించింది.  

click me!