కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. మహిళా కమీషన్ ఆగ్రహం, విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు

Siva Kodati |  
Published : Mar 11, 2023, 02:56 PM ISTUpdated : Mar 11, 2023, 03:03 PM IST
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. మహిళా కమీషన్ ఆగ్రహం, విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  సంజయ్ వ్యక్తిగతంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని సుమోటోగా తీసుకున్న కమీషన్ .. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లుగా ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. సంజయ్ వ్యక్తిగతంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలాగే డీజీ ర్యాంక్ అధికారితో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. 

ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. తెలంగాణ ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం డీల్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన డబ్బును పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా? లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారా? లేదా నిరుద్యోగ భృతికి ఖర్చు చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. 

ALso REad: ఢిల్లీలో బీఆర్ఎస్ నిరసన.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం..

కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ  బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?