కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా?.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ: రేవంత్ రెడ్డి

Published : Mar 11, 2023, 02:46 PM IST
కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా?.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ: రేవంత్ రెడ్డి

సారాంశం

బీజేపీ, బీఆర్ఎస్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఆమె తండ్రి, సీఎం కేసీఆర్ వీధుల్లోకి వచ్చిన ఆందోళన చేస్తాడని.. 
పోటీగా  బీజేపీ రోడ్డుపైకి వస్తుందని అన్నారు. ఇదంతా ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని ఆరోపించారు. లంచం ఇచ్చారని, తీసుకున్నారని అంటున్నారని.. అలాంటప్పుడు దర్యాప్తు అధికారులు కవితను తీసుకుపోయి లోపలేయడానికి గంట చాలు అని అన్నారు

లిక్కర్ స్కామ్‌లో ఏ విధంగా కథ నడిచింది, ఎవరూ నామినీలు, ఎవరూ బినామీలు అనేది స్పష్టంగా చెబుతున్నారని.. అలాంటప్పుడు అరెస్ట్ చేయడానికి ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలయాపన ఎందుకు ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని మండిపడ్డారు. 

Also Read: కవిత ఈడీ విచారణ: పరిస్థితిపై కేసీఆర్ ఆరా.. అరెస్ట్ చేస్తే భారీ ప్లాన్.. ఆప్ నేతలతో మంతనాలు..!!

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. తమ పార్టీ పోరాటంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కదిలిక  వచ్చిందని చెప్పారు. ఈరోజు పవన్ ఖేరా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ ఒత్తిడి వల్లే సీబీఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇంటికి వచ్చి విచారించిందని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని అన్నారు. 

మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడంపై కూడా పవన్ ఖేరా స్పందించారు. కవిత పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడారని ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు