గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: రాజారావుతో సునీత లక్ష్మారెడ్డి భేటీ

By narsimha lodeFirst Published Aug 17, 2021, 12:32 PM IST
Highlights

 గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ రాజారావుతో మహిళా కమిషన్ చైర్ పర్సన్  సునీతా లక్ష్మారెడ్డి భేటీ మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన గురించి ఆమె అడిగి తెలుసుకొన్నారు.ఆసుపత్రిలో భద్రత గురించి ఆమె చర్చించారు. సీసీ కెమెరాలు గురించి కూడ ఆమె వాకబు చేశారు.

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆరా తీస్తున్నారు.మంగళవారం నాడు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్  రాజారావుతో మహిళా కమిషన్  ఛైర్మెన్ సునీత లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు.  ఈ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోంది.

also read:గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్: ఆచూకీ లేని మరో మహిళ, పోలీసుల అదుపులో ఏడుగురు

ఈ విషయమై సూపరింటెండ్ తో ఆమె చర్చించారు. ఇప్పటికే ఓ మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆసుపత్రిలోని చీకటి రూమ్ ఎక్కడ ఉందనే విషయమై కూడ సూపరింటెండ్ తో కలిసి ఆమె పరిశీలించారు. 

ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడున్నాయనే విషయమై అడిగి తెలుసుకొన్నారు.ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గురించి కూడా ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ఘటనలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

click me!