కరోనా టెస్టుల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకొంటున్నాయి. కరోనా పరీక్షలు చేయించుకోకుండానే ఓ మహిళకు కరోనా సోకినట్టుగా వైద్య శాఖ నుండి సమాచారం రావడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. పరీక్షలు చేయించుకోకుండానే కరోనా ఎలా నిర్ధారించారని ఆ మహిళ ప్రశ్నిస్తోంది.
షాద్‌నగర్: కరోనా టెస్టుల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకొంటున్నాయి. కరోనా పరీక్షలు చేయించుకోకుండానే ఓ మహిళకు కరోనా సోకినట్టుగా వైద్య శాఖ నుండి సమాచారం రావడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. పరీక్షలు చేయించుకోకుండానే కరోనా ఎలా నిర్ధారించారని ఆ మహిళ ప్రశ్నిస్తోంది.
also read:కరోనా రోగుల మధ్యే గంటల తరబడి డెడ్‌బాడీ: భయాందోళనలో పేషెంట్లు
undefined
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు ఓ మహిళ సోమవారం నాడు ఆసుపత్రి వద్దకు వెళ్లింది. ఈ మహిళ కరోనా పరీక్షల కోసం తన వంతు కోసం ఎదురు చూసింది. అయితే ఆమె వంతు కోసం వచ్చేసరికి కరోనా పరీక్షలు నిర్వహించే కిట్స్ అయిపోయాయి. ఇదే విషయాన్ని ఆమెకు వైద్య సిబ్బంది చెప్పారు.
also read:జీహెచ్ఎంసీలో కరోనా జోరు: తెలంగాణలో మొత్తం కేసులు 46,274కి చేరిక
కిట్స్ లేకపోవడంతో ఆ మహిళ ఆసుపత్రి నుండి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు కరోనా సోకిందని వైద్య సిబ్బంది నుండి సమాచారం వచ్చింది. దీంతో ఆమె షాకైంది. తనకు పరీక్షలు నిర్వహించకుండానే తనకు ఎలా కరోనా సోకిందని నిర్ధారించారని ఆమె ప్రశ్నించింది.
కరోనా వచ్చిందని ప్రచారం చేయడంతో ఆమె ఆవేదన చెందుతోంది. పరీక్షలు చేయకుండానే కరోనా సోకిందని సమాచారం పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.
అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకుండా ఆ మహిళకు కరోనా సోకిందని ఎలా నిర్ధారించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.