రోడ్డు ప్రమాదంలో ఇద్దరు, అనారోగ్యంతో మరొకరు

By telugu news teamFirst Published Jul 21, 2020, 8:20 AM IST
Highlights

జాతీయ రహదారిపై మండల పరిధిలోని బోట్లోనితండా సమీపంలో అదుపుతప్పి కింద పడిపోయారు. హన్మంతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అంజిలయ్యను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎస్వీఎస్ కు తరలించారు. అయితే..  అక్కడికి తరలించిన వెంటనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. 

ఒకే ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా... మరోకరు అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు. దీంతో చౌదర్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బోయిని హన్మంతు(36), మంగలి అంజిలయ్య(35) ఆదివారం రాత్రి బైక్ పై గ్రామానికి వెళ్తుండగా.. బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మండల పరిధిలోని బోట్లోనితండా సమీపంలో అదుపుతప్పి కింద పడిపోయారు. హన్మంతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అంజిలయ్యను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎస్వీఎస్ కు తరలించారు. అయితే..  అక్కడికి తరలించిన వెంటనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. 

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కటికె శివరాం(70) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. ముగ్గురి అంత్యక్రియలు సోమవారం గ్రామంలో  నిర్వహించడంతో విషాదం చోటుచేసుకుంది. మండల ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

click me!