ఈ రెండురోజులూ తెలంగాణలో భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 2, 2021, 9:30 AM IST
Highlights

ఈ రెండు రోజులూ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కూడా కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 
 

హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి వుందని... దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కూడా కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుగ్గా వుందని... వీటి ప్రభావంతో జులై నెలలో పుష్కలంగా వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. సాధారణ వర్షపాతం కానీ అంతకంటే ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. 

గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.  పలుచోట్ల భారీ వర్షపాతం నమోదవగా మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, భద్రాద్రి, ములుగు,  ఆసిఫాబాద్, వరంగల్ అర్భన్, రూరల్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి.  

click me!