Telangana టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..పరీక్షల తేదీలు మారాయి..జర చూసుకోండి మరి!

Published : Jun 05, 2025, 09:41 AM IST
exams

సారాంశం

తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. రెండు షిఫ్టులలో 16 రోజులు పరీక్షలు, 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ టెట్ పరీక్షల తేదీలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. తాజా షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు జూన్ 18న ప్రారంభమై జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. మొదట జూన్ 15న పరీక్షలు మొదలవుతాయని భావించినప్పటికీ, తాజా తేదీలతో షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ అప్‌డేట్ చేసింది.

ఈ పరీక్షలు మొత్తం 16 రోజులపాటు రెండు షిఫ్టులుగా జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండో సెషన్ ఉంటుంది. 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 1, 6వ తరగతి పైగా బోధించాలనుకునే వారికి పేపర్ 2 నిర్వహించనున్నారు.

తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలోనే..

టెట్ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలోనే కాకుండా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషల్లో కూడా నిర్వహించనున్నారు.పేపర్ 2లో భాగంగా మ్యాథ్స్, సైన్స్ పరీక్షలతో మొదలవుతాయి. మైనారిటీ భాషల్లో మిగిలిన సబ్జెక్టులతో జూన్ 30న పరీక్షలు ముగియనున్నాయి. హాల్ టికెట్లు జూన్ 9న నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి (https://tgtet.aptonline.in/tgtet).

ఈసారి హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, ములుగు సహా 14 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1కి 63,261 మంది, పేపర్ 2కి 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న…

ఇప్పటికే ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేసినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఏడాది సుమారు 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా రెండు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించగా, గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్షలు జరిపింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదలయ్యాయి. ఆ పరీక్షకు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చినా ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినట్టు స్పష్టమవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?