తెలంగాణా టీచర్ మనసు గాయపడింది

Published : Dec 15, 2016, 03:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
తెలంగాణా టీచర్ మనసు గాయపడింది

సారాంశం

తెలంగాణా  మేధావి గా  పేరున్న ఘంటాచక్రపాణి  టీచర్ల మీద చేసిన వ్యాఖ్యలు తెలంగాణా టీచర్ల క్యారెక్టర్ అసాసినేషన్ అని అంటున్నారు.  పదవొస్తే ప్రజల భాష మర్చిపోతారా, పాలక వర్గ భాష వచ్చేస్తుందా 

 

 

 

పదవొస్తే ఉన్నమతి పోతుందా అని తెలంగాణా టీచర్లు ఆశర్య పోతున్నారు. ఈ ఆశ్చర్యానికి కారణం,  ఈ మధ్య వాళ్లకు ఒక తెలంగాణా మేధావి, ఒక  మంత్రి చేసిన హితోపదేశం. 

 

ఇందులో మేధావి , తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛెయిర్మన్ ఘంటా చక్రపాణి కాగా, మంత్రి కడియం శ్రీహరి. 

 

తెలంగాణాలో మంచి ప్రజాహిత మేధావిగా పేరున్న ఘంటా చక్రపాణి, టి. ఉద్యమం బలపడేందుకు ఎంతో శ్రమించారు. ఎన్నో వ్యాసాలు రాశారు.  ఎన్నో ప్రసంగాలు చేశారు. తెలంగాణా జనం గుండె చప్పుడిని  "ఘంటా" పదంగా వినిపించిన వాడిగా చక్రపాణికి తెలంగాణ సమాజంలో ఒక గుర్తింపుగా ఉంది. 

 

2001 టి ఆర్ యస్ ఆవిర్భానికి ముందే సమాజంలో వైరుధ్యాలకు,పరిష్కారాలను వెదికే పనిలో పడ్డ మేధావి అంటారు. అయితే,   ఈ మధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉపాధ్యాయ వర్గంలో ప్రకపంనలు సృష్టిస్తున్నాయి.

 

ఈ మధ్య ఒక ఉపాధ్యాయ సంఘం సభలో ‘ఉపాధ్యాయుల నడవడి-అంకితభావం’ మీద  ఉపన్యాసం చేస్తూ ఘంటా చక్రపాణి చాలా  దురుసు వాఖ్యానం చేశారని వారంటున్నారు.  ఆయన చేసిన వ్యాఖ్యలు :

#ఒక వైపు కేజి టు పీజీ  సరిగా అమలుకావాలని నిలదీయాలని పిలుపునిస్తూ.....ఉపాధ్యాయులు పాన్ పరాగ్ లు,సిగరెట్లు తెప్పించుకోవడం

 

#  బంద్ చేయాలంటున్నారు.  బడికి సక్కగ టైమ్ కు ఎంతమంది వెళ్తున్నారో చూడండి.

 

బడికి టైమ్ కి పోకపోతే బయో మెట్రిక్ అమలవుతూనే వుంది.. ఇంకా కఠినంగా వ్యవహరింవచ్చుకదా అనేది ఉపాధ్యాయుల వాదన.

 

మరొక వైపు ఉపముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి  కడియం శ్రీహరి, --మీకు ఉపాధ్యాయులకు  సంఘాలు ఎందుకు..దండగ ? ధర్నాలు ఎందుకు..?  అనడం పట్ల వాళ్లు ఇంకా ఆశ్చర్యపోతున్నారు.

‘మీకు యూనియన్ లీడరును నేనే’ అని   ప్రకటించారు.

 

ఒకరేమో ఏ సంఘం బతుకొద్దని హుకుమ్   చేస్తున్నారు, మరొక రు ఉపాధ్యాయులు-పాన్ పరాగ్ ,సిగరెట్టు అంటూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఇది ఇరువైపుల దాడి కాదా...? అని ఉపాధ్యాయులు అడుగుతున్నారు.

 

#మనమొచ్చిన సామాజిక వర్గాలను కాదని పాలకుల కులాల బేషజాలు, అహంకారాలు, పక్షపాత వైఖరిని కాకుండా --ప్రజల్ని, ఉద్యోగుల్ని కలుపుకొని పోవాల్సిన వైఖరిని తీసుకోవాలని వారు ఆవేదనతో కోరుతున్నారు.

 

ఈ టీచర్లు వాయిస్ అచ్చేసేందుకు పత్రికలు లేవు కాబట్టి వీరంతా సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 

కడియం రాజకీయనాయకుడు కాబట్టి ఆయన మాటలు వాళ్లని అంతగా బాధించలేదు. అయితే, ప్రజల పక్షాన నిలబడిన ఘంటా చక్రపాణి  ఉపాధ్యాయ వ్యవస్థను కించపరిచే స్టాండ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు,.

 

అయినా..,ప్రభుత్వ సంస్థలకు ,అధిపతులుగా ,నిర్వాహాకులుగా ఉన్నంత మాత్రాన నిర్మోహామాటంగా ఉన్నమాట అనడం చేతకాదా...?అని అడుగుతున్నారు.

 

అంత చేవచిచ్చి ఉన్నామా..? లేదా అంత అవకాశవాదంలో కూరుకుపోయినామా..? అని సంశయం వ్యక్తం చేస్తున్నారు.

 

అన్నీ తామే అయి,బడి పిల్లలను క్యూ లో నిలబెట్టి ఊరేగింపులు ,మానవ హారాలు చేయించి,వంటావార్పు చేయించి, ఉద్యమ పాఠాలు నేర్పి, జండాలు మోయించి, తెలంగాణ రాష్ట్రం  కోసం ఆవేశంగా ,లాఠీని లెక్కచేయకుండా  "'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైనా చేతనమని"' తెలంగాణ జాతీయ గీతం పాడించిన ఉపాధ్యాయుల దగ్గర గుట్కా, సిగరెట్ వాసన వస్తుందన్న వాఖ్యలు ఖండించాల్సిందే కదా  అని అంటున్నారు. ఘంటా ఏమంటారో చూద్దాం.

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?