
హోం వర్క్ అని చెప్పి ఇంటర్నెట్ సెంటర్లలలో గంటలు గంటలు గడుపుతూ నీలి చిత్రాలు చూస్తున్న 65 మంది టీనేజర్లను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివిధ నెట్ సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు అనుమానం వచ్చి టీనేజర్లు ఉన్న నెట్ కేబిన్ లను పరిశీలించగా ఈ విషయం బయటపడింది.
రూల్స్ ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా, చిన్నారులను బ్లూ ఫిల్మ్ వీడియోలకు దూరంగా ఉంచాలన్న కనీస ప్రమాణాలు పాటించని 16 సైబర్ కేఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టుబడ్డ టీనేజర్లకు, వారి తల్లిదండ్రులకు పోలీసుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.