అంబాసిడర్‌గా దేత్తడి హారికే కొనసాగుతారు, అందరికీ చెప్పా: ఉప్పల శ్రీనివాస్ క్లారిటీ

By Siva KodatiFirst Published Mar 9, 2021, 8:47 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్‌, దేత్త‌డి హారికే ఉంటార‌ని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్‌, దేత్త‌డి హారికే ఉంటార‌ని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా స్ప‌ష్టం చేశారు.

హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ కార్యాల‌యంలో ఎం.డి మ‌నోహ‌ర్ రావుతో క‌లిసి ఆయ‌న మంగళవారం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్త‌డి హారికను తొల‌గించార‌ని ప‌లు మీడియా చాన‌ళ్లలో వ‌స్తున్న వార్త‌లను ఆయ‌న ఖండించారు.

దేత్త‌డి హారికను తొల‌గించార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్ , శ్రీ‌నివాస్ గౌడ్ నాయ‌క‌త్వంలో ముందుకు వెళుతున్నామ‌ని ఆయన స్పష్టం చేశారు.

Also Read:బిగ్ బాస్ ఫేమ్ హారికకు షాక్: ఉప్పల శ్రీనివాస్ మీద ఆగ్రహం

అందుకోస‌మే టూరిజాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌చారం చేస్తున్నామ‌ని ఛైర్మన్ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలోనే దేత్త‌డి హారికను నియ‌మించ‌డం జ‌రిగింద‌ని ఆయన పేర్కొన్నారు.

ఈ విష‌యంలో మంత్రులు, ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించే ముందుకు వెళ్లామ‌ని శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. అయితే కొంద‌రు గిట్ట‌ని వాళ్లు దేత్త‌డి హారిక‌ను తొల‌గించిన‌ట్లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఇలాంటివి న‌మ్మొద్ద‌ని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ టూరిజాన్ని నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. 

అంతకుముందు  బిగ్ బాస్ ఫేమ్ హారికకు షాక్ తగిలింది. ఆమెను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు తెలియకుండా హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్ప శ్రీనివాస్ మీద అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం వెబ్ సైట్ నుంచి హారిక వివరాలను తొలగించారు. 

click me!