పీఆర్‌సీ రగడ: ఆంధ్రా కంటే ఎక్కువే ఇస్తా... ఉద్యోగులకు కేసీఆర్ హామీ

Siva Kodati |  
Published : Mar 09, 2021, 08:20 PM ISTUpdated : Mar 09, 2021, 08:21 PM IST
పీఆర్‌సీ రగడ: ఆంధ్రా కంటే ఎక్కువే ఇస్తా... ఉద్యోగులకు కేసీఆర్ హామీ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పీఆర్‌సీపై ప్రకటన ఉంటుందని సీఎం స్పష్టం చేయడంతో సచివాలయంలో ఉద్యోగ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పీఆర్‌సీపై ప్రకటన ఉంటుందని సీఎం స్పష్టం చేయడంతో సచివాలయంలో ఉద్యోగ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఏపీలో ఇచ్చిన 27 శాతం కంటే ఎక్కువే పీఆర్‌సీని అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

గత కొంతకాలంగా తెలంగాణలో కొలువుల కొట్లాట నడుస్తోన్న నేపథ్యంలో కేసీఆర్ దీనికి ఫుల్‌స్టాప్ పెట్టారు. వయో పరిమితి పెంపుపైనా సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని... ఆ మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!