అన్నం పెట్టిన సంస్థకే కన్నం: ఏటీఎంలలో డిపాజిట్ ముసుగులో.. కోటీ 30 లక్షలు స్వాహా

By Siva KodatiFirst Published Mar 9, 2021, 8:05 PM IST
Highlights

కంచే చేసు మేసిందన్న చందంగా తమకు అన్నం పెడుతున్న యాజమాన్యానికే కన్నం వేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న సంస్థను దోచేశారు ఉద్యోగులు.

కంచే చేసు మేసిందన్న చందంగా తమకు అన్నం పెడుతున్న యాజమాన్యానికే కన్నం వేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న సంస్థను దోచేశారు ఉద్యోగులు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి తమ సిబ్బందిని పంపింది.

అయితే నిందితులు ఆ డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయకుండా తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. ఈ విధంగా డిపాజిట్ పేరుతో దాదాపు  కోటి 30 లక్షల రూపాయలను స్వాహా చేశారు.

అయితే సిబ్బందిపై సంస్థకు అనుమానం రావడంతో డబ్బుల మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 16 లక్షలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. 

click me!