తెలంగాణలో కరోనా జోరు: మొత్తం కేసులు 5,32,794కి చేరిక

Published : May 17, 2021, 08:02 PM IST
తెలంగాణలో కరోనా జోరు: మొత్తం కేసులు 5,32,794కి చేరిక

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది.  గత 24 గంటల్లో 3961 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 5,32,794కి చేరుకొన్నాయి. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది.  గత 24 గంటల్లో 3961 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 5,32,794కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో62,591 మందికి పరీక్షలు నిర్వహిస్తే  3961 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.  రాష్ట్రంలో కరోనాతో 30 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 2,985కి చేరుకొంది. రాష్ట్రంలో ఇంకా 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖధికారులు చెబుతున్నారు.   రాష్ట్రంలో గత 24 గంటల్లో 5559 మంది కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొన్నా వారి సంఖ్య 4,80,458కి చేరుకొంది. 

గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో25, భద్రాద్రి కొత్తగూడెంలో 139, జీహెచ్ఎంసీ పరిధిలో631 జగిత్యాలలో101,జనగామలో 39, జయశంకర్ భూపాలపల్లిలో60, గద్వాలలో75, కామారెడ్డిలో 33, కరీంనగర్ లో 160,ఖమ్మంలో 229, మహబూబ్‌నగర్లో 135, ఆసిఫాబాద్ లో 30, మహబూబాబాద్ లో57, మంచిర్యాలలో 122, మెదక్ లో51 కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో 258,ములుగులో62,నాగర్ కర్నూల్ లో 149,నల్గగొండలో138, నారాయణపేటలో32, నిర్మల్ లో 26, నిజామాబాద్ లో88,పెద్దపల్లిలో130,సిరిసిల్లలో73,రంగారెడ్డిలో257 సిద్దిపేటలో 118 సంగారెడ్డిలో73,సూర్యాపేటలో80, వికారాబాద్ లో 137, వనపర్తిలో108, వరంగల్ రూరల్ లో 99,వరంగల్ అర్బన్ 141, యాదాద్రి భువనగిరిలో 105 కేసులు నమోదద్యాయి.


 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్