కరోనాపై కేసీఆర్ సమీక్ష:లాక్‌డౌన్ అమలుపై ఆరా

By narsimha lodeFirst Published May 17, 2021, 4:19 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో కరోనాపై సమీక్ష నిర్వహించారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో కరోనాపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న తీరు తెన్నులతో పాటు  కరోనా కేసులు, మందులు, వ్యాక్సిన్ తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, కరోనా రోగులకు అవసరమైన సదుపాయాల కల్పన విషయమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

also read:కరోనా పరిస్థితులపై విచారణ: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  పెరుగుదలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్‌డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది.  లాక్‌డౌన్ అమలు తర్వాత  రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎలా ఉందనే విషయమై కూడ సీఎం అధికారులను ఆరా తీశారు. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.  జీహెచ్ఎంసీ తో పాటు పలు జిల్లాల్లో ఫీవర్ సర్వును కూడ  చేపట్టారు. ఈ సర్వే ఆధారంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి కరోనా కిట్స్ అందించి హోం క్వారంటైన్ లోనే చికిత్స అందిస్తున్నారు. కరోనా తీవ్ర లక్షణాలున్న వారిని ఆసుపత్రుల్లో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. 


 

click me!