కరోనా వ్యాక్సిన్‌, వెంటిలేటర్లను ఉపయోగించుకోలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

By narsimha lodeFirst Published May 17, 2021, 6:30 PM IST
Highlights

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను సక్రమంగా వినియోగించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను సక్రమంగా వినియోగించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సోమవారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు  కేంద్ర ప్రభుత్వం 61.41 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ కేవలం 54 లక్షల వ్యాక్సిన్ డోసులను మాత్రమే ఉపయోగించిందన్నారు. ఇంకా 6.39 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. 

అయినా కూడ మూడు రోజులుగా రాష్ట్రంలో ఎవరికీ కూడ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ ను కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు తీసుకొన్నారా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ తీసుకోవాలని కూడ కేసీఆర్ ప్రజలను ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. 

టాస్క్‌ఫోర్స్‌ ఎవరిని ఉద్దరించేందుకు ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేసి కలెక్షన్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి పంపిన వెంటిలేటర్లను కూడ ప్రభుత్వం వాడుకొనే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కనీసం 30 శాతం ధాన్యం కూడ కొనుగోలు చేయలేదని ఆయన చెప్పారు. 

click me!