Telangana: నల్గొండలో అరుదైన రాతి శిల్పాలు.. 4000 ఏండ్ల చారిత్రక ఆన‌వాళ్లు ల‌భ్యం !

Published : Jan 27, 2022, 08:55 AM IST
Telangana: నల్గొండలో అరుదైన రాతి శిల్పాలు.. 4000 ఏండ్ల చారిత్రక ఆన‌వాళ్లు ల‌భ్యం !

సారాంశం

Telangana: తెలంగాణ చారిత్రక పరిశోధనలు సాగిస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు అరుదైన రాతి శిల్పాలు, చారిత్రక అనవాళ్లను గుర్తించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని భట్టుగూడెంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ శివనాగి రెడ్డి  బృందం.. ఈ 1000 ఎండ్ల నాటి అరుదైన రాతి శిల‌లు, శిల్పాలు గుర్తించింది. అలాగే, 4000 ఏండ్ల కాలం నాటి రాతి గొడ్డలిని సైతం బయటకు తీశారు.    

Telangana: తెలంగాణ చారిత్రక పరిశోధనలు సాగిస్తున్న పురవస్తు శాస్త్రవేత్తలు అరుదైన రాతి శిల్పాలు, చారిత్రక అనవాళ్లను గుర్తించారు. నల్గొండ (Nalgonda) జిల్లా పెద్దవూర మండలంలోని భట్టుగూడెం (Bhattugudem) లో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ శివనాగి రెడ్డి  బృందం.. ఈ 1000 ఎండ్ల నాటి అరుదైన రాతి శిల‌లు, శిల్పాలు గుర్తించింది.  వీటి గురించి  పురావ‌స్తు శాస్త్ర‌వేత్త ఈ.శివ‌నాగి రెడ్డి (Archaeologist) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ప్రాంతం ఎంతో చారిత్రాత్మ‌క‌మైన‌ద‌ని అన్నారు. ఈ ప్ర‌దేశం నియోలిథిక్ (neolithic), మెగాలిథిక్ (megalithic), శాతవాహన (Satavahana) కాలం నాటి అవశేషాలతో నిండి ఉంద‌ని తెలిపారు. ఇద్దరు చారిత్ర‌క ఔత్సాహికులు, టీజీ.సైదారెడ్డి, కే. వెంకటరెడ్డి, శివనాగి రెడ్డిల బృందం.. న‌ల్గొండ‌లోని భ‌ట్టుగూడేంలో కొంత కాలంగా ప‌రిశోధ‌న‌లు సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి  పొలాల్లో విస్తృతంగా సర్వే నిర్వహించి, 4,000 BC నాటి నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలిని గుర్తించారు. క్రీ.పూ. 1,000 నాటి మెగాలిథిక్ కాలం నాటి ఇనుప స్లాగ్‌లు, క్రీ.శ. మొదటి, రెండవ శతాబ్దాల శాతవాహనుల కాలం నాటి ఎరుపు రంగు పాలిష్ చేసిన సామాను కూడా వారు కనుగొన్నారు. 

శివనాగి రెడ్డి (Archaeologist) బృందం గుర్తించిన ఈ చారిత్ర‌క అన‌వాళ్లు, రాతి శిల్పాల్లో త్రిమూర్తి రూపంలో భైరవ, బ్రహ్మ, వల్లి సుబ్రహ్మణ్య రూపంలో ఉన్న అత్యంత అరుదైన రాతి శిల్పాలు ఉన్నాయి. ఈ త‌ర‌హా అన‌వాళ్లు (సూర్య, మహిషాసురమర్ధిని) రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్యుల శైలులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్తకామేశ్వర దేవాలయం ఆవరణలో నిర్లక్ష్యంగా పడివున్న‌ట్టు గుర్తించారు. క్రీ.శ. 13వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి కొన్ని హిస్టారిక‌ల్ రాతి శిల్పాలు కూడా ఈ త‌వ్వ‌కాల్లో బయటపడ్డాయి. వీటిని ఏనుగుపై అమర్చినట్లు చిత్రీకరించారు. అలాగే, కత్తులు పట్టుకున్న వారు ఈ వీరులు స్థానిక పోరాటాలలో తమ ప్రాణాలను కోల్పోయారని, ఖగోళ పరిచారికలు.. రంభ, ఊర్వసిలచే స్వాగతం పలుకుతున్నారని వెల్లడిస్తున్నారు. శివనాగి రెడ్డి వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం భైరవ, బ్రహ్మ శిల్పాలు వాటి రూపంలో, ప్రతిమలో ఉండ‌టం చాలా అరుదు. ఆలయ సమీపంలో ఉన్న చెత్త గుంతలో శిల్పకళా ఫలకాలను పడవేయగా, ఇవి నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని ఆయన తెలిపారు.

కాగా, గ‌తేడాది కూడా రాష్ట్రంలోని సిద్ధిపేట‌లో  ఆదిమానవుడి ఆనవాళ్లను పురావ‌స్తు ప‌రిశోధ‌కులు గుర్తించారు. పాత రాతియుగం, కొత్త రాతియుగం, రాగి యుగం, ఆధునిక శిలాయుగం ఇలా అన్ని యుగాల మానవులు ఇక్కడ  జీవించిన‌ట్టు అప్పుడు బ‌య‌ట‌ప‌డిన చారిత్ర‌క అన‌వాళ్ల ద్వారా తెలిసింది.  జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా... వారి సంచారానికి సంబంధించిన సాక్ష్యాల‌ను గుర్తించారు. సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు కేంద్రంగా ఆదిమాన‌వులు నివాస‌మున్న‌ట్టు, వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు అక్క‌డ లభించాయి. ఈ వ‌స్తువులు దాదాపు క్రీ.పూ 5 వేల ఏళ్ల క్రితం నాటివని పురావ‌స్తు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. సింగరాయ‌కొండ‌లో కూడా ఇలాంటి చారిత్ర‌క అన‌వాళ్ల‌ను గుర్తించారు. అలాగే,  శనిగరం, నంగునూరు, కూరెళ్ల, కోహెడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ