రూ. 90 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి.. అకౌంట్ లో వేయమంటే..అడ్రస్ లేకుండా పోయాడు..

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 7:45 AM IST
Highlights

మూడు నెలలుగా ఈ సంస్థలో వినోద్ కుమార్ అనే ఉద్యోగి అడ్మిన్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. జనవరి 23న జనరల్ మేనేజర్ బి. శ్రీనివాసరావు అదే సంస్థలో పనిచేస్తున్న అసోసియేట్ మేనేజర్ టి. శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.90లక్షలు సంస్థ ఖాతాలో జమ చేయాలని సూచించారు.ఈ మేరకు ఆయన ఆ డబ్బును వినోద్ కుమార్ కు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అప్పగించాడు.

జూబ్లీహిల్స్ : employment ఇచ్చి ఆదుకున్న సంస్థకే కుచ్చుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. వచ్చిన కాడికి దండుకుని చక్కా పారిపోయాడు. అంత డబ్బు కలలో కూడా ఊహించలేననుకున్నాడో.. తననెవరు పట్టుకుంటారులే అనుకున్నాడో ఏమో కానీ.. రూ.90 లక్షలతో పరారయ్యాడు. వివరాల్లోకి వెడితే.. 

Company ఖాతాలో డబ్బులు వేయమని ఇచ్చిన రూ. 90 లక్షలతో ఉద్యోగి  ఉడాయించిన ఘటన Banjara Hills పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన MG Group of Companiesకు పంజాగుట్టలోనూ ఓ శాఖ ఉంది. మూడు నెలలుగా ఈ సంస్థలో వినోద్ కుమార్ అనే ఉద్యోగి అడ్మిన్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. జనవరి 23న జనరల్ మేనేజర్ బి. శ్రీనివాసరావు అదే సంస్థలో పనిచేస్తున్న అసోసియేట్ మేనేజర్ టి. శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.90లక్షలు సంస్థ ఖాతాలో జమ చేయాలని సూచించారు.

ఈ మేరకు ఆయన ఆ డబ్బును వినోద్ కుమార్ కు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అప్పగించాడు. డబ్బుతో వెళ్ళిన వినోద్ కుమార్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు.. అతడిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి సంస్థకు విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జనవరి 23న బయటపడింది. బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓ మహిళ వందలాది మహిళలతో చిట్టీలు కట్టించి.. వారిని బురిడి కొట్టించింది. దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. అయితే ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్తుండగా బాధిత మహిళలు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. వివరాలు.. అనంతపురంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి సాయినగర్‌ మొదటి క్రాస్‌లో ఉమెన్స్‌ బ్యూటీ పార్లర్‌ నిర్వహించేది. స్థానికంగా ఉండే మహిళలతో చిట్టీలు నిర్వహించేది. అయితే కొంతకాలంగా విజయలక్ష్మి వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతోంది. చిట్టీల గడువు ముగిసినప్పటికీ .. డబ్బులు మాత్రం ఇచ్చేది కాదు. 

ఈ క్రమంలోనే  అర్ధరాత్రి జయలక్ష్మి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుందనే సమాచారం తెలుసుకున్న బాధితులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు  తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకన్న మరికొంత మంది బాధితులు కూడా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. అయితే ఎస్ఐ రాఘవరెడ్డి తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని బాధిత మహిళలు చెబుతున్నారు. న్యాయం చేయమని కోరితే.. ఎవరినడిగి చిట్టీలు వేశారంటూ మండిపడుతున్నారని తెలిపారు. 

జయలక్ష్మికి ఎస్సై వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. ఎస్సై రాఘవరెడ్డి తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఇది సివిల్ కేసు అని, బాధితులు ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే జయలక్ష్మిపై అనంతపురం పోలీస్ స్టేషన్లలో చెక్ బౌన్స్ కేసులు ఉన్నట్టుగా సమాచారం. 

click me!