సరికొత్త హంగులతో టీఎస్​ఆర్టీసీ నూతన వెబ్​సైట్: సూచనలు పంపాల్సిందిగా ఆహ్వానం

Siva Kodati |  
Published : Jan 26, 2022, 09:51 PM IST
సరికొత్త హంగులతో టీఎస్​ఆర్టీసీ నూతన వెబ్​సైట్: సూచనలు పంపాల్సిందిగా ఆహ్వానం

సారాంశం

ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (telangana state road transport corporation) . ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం (republic day) సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్‌ని ప్రారంభించింది.

ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (telangana state road transport corporation) . ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం (republic day) సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్‌ని ప్రారంభించింది. సంస్థ కొత్త వెబ్​సైట్​ tsrtc.telangana.gov.in ను బుధవారం ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​రెడ్డి, ఎండీ సజ్జనార్​లు (vc sajjanar) ఆవిష్కరించారు. ఆర్టీసీ నూతన వెబ్​సైట్​ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా ఉపయోగించేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్​, ఎండీ తెలిపారు.

గతంలో వున్న ఆర్టీసీ వెబ్‌సైట్‌కు అవసరమైన మార్పులు చేసి అదనపు హంగులతో దీనిని తీర్చిదిద్దారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించి విలువైన అభిప్రాయాలు, సూచనలను పంపాలని టీఎస్​ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతకుముందు బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్​ గోవర్ధన్​, ఎండీ వీసీ సజ్జనార్​లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ ఆర్టిసి ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ సంస్థను బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులను మరింత ఆకట్టుకునేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక నిర్ణయాలతో ప్రయాణికులకు దగ్గరైన ఆర్టిసిని చిన్నారులకు కూడా చేరువ చేసేందుకు జాతీయ బాలల దినోత్సవాన్ని ఉపయోగించుకున్నారు. 

నవంబర్ 14న చిల్డ్రన్ డే సందర్భంగా టీఎస్ ఆర్టిసి బస్సుల్లో చిన్నారులరకు ఉచిత ప్రయాణ కల్పించారు. పదిహేను సంవత్సరాలలోపు బాలబాలికలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అన్నిరకాల బస్సుల్లో ఈ ఒక్క రోజు(ఆదివారం) ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే TSRTC సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు టీఎస్ ఆర్టిసి తెలిపింది. 

ఇక ఇప్పటికే వివాహాల కోసం ఆర్టిసి బస్సులను బుక్ చేసుకుంటే ఆ నూతన జంటకు ఆర్టిసి తరపున జ్ఞాపికను అందజేయాలని ఎండి Sajjanar నిర్ణయించారు. నూతన జంటను స్వయంగా ఆశీర్వదించిన సజ్జనార్ ఆర్టిసి తరపున కానుకలు ఇచ్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. పెళ్లికి హాజరైన సజ్జనార్.. డ్రైవర్లు ముత్యాల ఆంజనేయులు, పబ్బాటి గణేష్ చేతులమీదుగా నూతనజంటకు జ్ఞాపికను అందజేసారు.  

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu