తెలంగాణ ఎన్నికలు.. రేపు మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్ పార్టీ..

By Sumanth Kanukula  |  First Published Nov 16, 2023, 11:57 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో అన్ని వర్గాలను ఆకర్షించేలా హామీలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం.. తీవ్ర కసరత్తు చేసింది. 

మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు, కళ్యాణ లక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.. వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సంక్షేమ పథకాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉంది. 

Latest Videos


మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కాంగ్రె పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. రేపు ఖర్గే హైదరాబాద్‌కు రానుండగా.. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సభల్లో ఆయన  పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ రేపు(నవంబర్ 17)న తెలంగాణకు రానున్నారు. రాహుల్ 5 నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు, సభల్లో పాల్గొనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

click me!