తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ : అన్ని దశలు దాటిన తరువాత అభ్యర్థిత్వం రద్దు.. ఆందోళనలో అభ్యర్థులు

By SumaBala Bukka  |  First Published Jun 28, 2023, 8:12 AM IST

అన్ని పరీక్షల్లోనూ నెగ్గుకుంటూ చివరి స్థాయికి వచ్చిన తరువాత అభ్యర్థిత్వం చెల్లదంటూ చెప్పడంతో టీఎస్ఎల్ పీఆర్బీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


హైదరాబాద్ : తెలంగాణలోని పోలీస్ అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎస్ఎల్ పీఆర్బీ.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో ఇది జరగడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ప్రాథమిక రాత పరీక్ష, శారీరక సామర్ధ్య పరీక్షలు చివరి రాత పరీక్షల్లో నెగ్గి... ఇక నియామకమే అనే దశకు వచ్చిన తరువాత.. ఆయా అభ్యర్థుల అభ్యర్థిత్వం చెల్లదంటూ మండలి తిరస్కరించడంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

దీనికి కారణం వారి వయసు అని... అభ్యర్థులకు చెప్పిన వయసు కంటే ఎక్కువ ఉండడమేనని మండలి చెబుతోంది. అయితే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు.. అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తిరస్కారానికి గురైన అభ్యర్థుల వినతులు మండలికి వెల్లివెత్తుతున్నాయి. పోలీస్ నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్లు అభ్యర్థుల వయస్సు అర్హతల గురించి స్పష్టంగా తెలిపారు.

Latest Videos

undefined

మద్యం మత్తులో వాగ్వాదం.. తుపాకీతో భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత...

నిర్ణీత వయసుకు లోబడిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కూడా స్పష్టంగా తెలియజేశారు. ఆ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవడంతోనే ఇప్పుడు సమస్య మొదలయ్యింది. దరఖాస్తు సమయంలోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలన చాలా శ్రమతో కూడుకున్నది కావడంతో  ఆ సమయంలో దరఖాస్తు పత్రాల ధ్రువీకరణ సాధ్యపడలేదని… ఆ  ప్రక్రియను చివర్లో చేపట్టింది మండలి.  

అదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. అయితే, నిర్ణీత వయసు లేనివారిని ఉన్నవారిని దరఖాస్తు చేసిన సమయంలోనే తిరస్కరిస్తే ఇప్పుడీ గొడవ ఉండేది కాదన్న అంశం చర్చలోకి వస్తోంది. 

click me!