కలెక్టరమ్మ ఆమ్రపాలికి పెరుగుతున్న మద్దతు

First Published Oct 17, 2017, 4:31 PM IST
Highlights
  • నెటిజన్ల మద్దతు ఆమ్రపాలికే
  • డైనిమిక్ ఆఫీసర్ అంటూ ప్రశంసలు
  • కార్యకర్తల మాదిరిగా ట్రీట్ చేయడం తగదని హితవు

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి కటా, మంత్రి కేటిఆర్ వివాదం విషయంలో నెటిజన్లు పెద్దసంఖ్యలో ఆమ్రపాలికే మద్దతు పలుకుతున్నారు. మంత్రి హోదాలో కేటిఆర్ ఆమ్రపాలిపై విరుచుకుపడడం సరికాదంటున్నారు. గత రెండు రోజులుగా ఆమ్రపాలికి మద్దతుగా ఫేస్ బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఈ పోస్టులను పెద్ద సంఖ్యలో షేర్ లు, లైకులు చేస్తున్నారు.

వరంగల్ లో అభివృద్ధి పనుల విషయంలో అధికార యంత్రాంగం సరిగా వ్యవహరించలేదంటూ మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిన పథకాలే సరిగా అమలు కాకపోతే మీరేం చేస్తున్నట్లు అని నిలదీశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సిఎం ఆదేశాలు అమలు చేయాలని కేటిఆర్ హెచ్చరించారు.

ఈ విషయంలో నిజానికి ఆమ్రపాలి వైఫల్యం ఉందా లేదా అన్నది వేరే విషయమైనప్పటికీ హౌసింగ్ శాఖ అధికారి మంత్రి కేటిఆర్ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పలేదు. దీంతో ఆ అధికారిని కేటిఆర్ నిలదీశారు. అయితే తన సహా ఉద్యోగిని రక్షించే క్రమంలో ఆమ్రపాలి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మంత్రి కేటిఆర్ ఆమ్రపాలి మీద సీరియస్ అయ్యారు. డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలి అంటూ కరుకుగా మాట్లాడినట్లు వార్తలొచ్చాయి.

అయితే నిధుల విడుదల లేకుండా ఉత్తుత్తి హామీలిచ్చి పైగా డైనమిక్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలినే తప్పుపట్టడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఈమేరకు పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. 23 ఏళ్ల ప్రాయంలోనే ఐఎఎస్ అధికారిగా సెలెక్ట్ అయిన ఆమ్రపాలిని ఇలా నిలదీయడం సరికాదంటున్నారు. తండ్రి సిఎం అయినందున మంత్రిగా నియమించబడ్డ కేటిఆర్ కు ఆమ్రపాలిని నిలదీసే అర్హత లేదని కొందరు నెటిజన్లు ఘాటుగానే పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. కార్యకర్తలో వ్యవహరించినట్లు ఐఎఎస్ అధికారులతో వ్యవహరిస్తే ఎలా అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే అధికారులతో ఇలా వ్యవహరించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి కేటిఆర్, ఆమ్రపాలి వివాదంలో కేటిఆర్ కంటే ఎక్కువ మద్దతు ఆమ్రపాలికే దక్కినట్లు చెప్పవచ్చు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వ అనుకూల వర్గాలు మాత్రం కేటిఆర్ డైనమిజాన్ని కొనియాడుతున్నారు. వరంగల్ పర్యటనలో కేటిఆర్ జిల్లా నేతలకు, జిల్లా అధికారులకు దశ దిశ నిర్దేశించారని కొందరు కేటిఆర్ కు అనుకూలంగానూ పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అర్జున్ రెడ్డి హీరోలా బిహేవ్ చేసిన మేడ్చల్ మెడిక ో లు

https://goo.gl/zrDApr

 

click me!